అందం చుట్టూ.. విషమున్నా ఆస్వాదించవచ్చు సుమా..!

ప్రకృతిని ఆస్వాదించడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అది ఇలాంటి కాలుష్యం పెరిగిపోతున్న సాంకేతిక ప్రపంచంలో అయితే ఎక్కడ ప్రకృతి కనిపించినా మనసు అటువైపుకు తెలియకుండానే వెళ్ళిపోతుంది. దానిని అడుపు కూడా చేయలేము. అయితే ఆ అందమైన ప్రకృతిని తాకడం మాత్రం కుదరదు అంటే కాస్త కష్టంగానే ఉంటుంది. కనీసం చూసి ఆస్వాదించవచ్చు. ఇక అసలు ముట్టుకుంటేనే ఆ ప్రకృతి కాటేస్తుంది, చంపేస్తుంది అంటే, దానిని మాత్రం ఆస్వాదించడం అంత సులభం ఏమి కాదు. కానీ అదికూడా చూడడానికి కళ్ళు తిప్పలేని అందంగా ఉంటుంది మరి. ఆ ఆశ్చర్యంలో ముట్టుకుంటే ఇక అంతే, ఇలాంటి ప్రకృతి కూడా ఉంటుందా అంటే, ఇలాంటివి కూడా ఆస్వాదించాలని ప్రత్యేక అభిరుచి ఉన్నవారికోసం ఇలాంటివి ఏర్పాటు చేసినట్టు ఉన్నారు.
ఇక్కడ చూడటానికి అంతా పచ్చదనం, ప్రకృతి మాదిరే ఉంటుంది. కానీ ముట్టుకుంటే మాత్రం చాలా ప్రమాదం. ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేయడం అసలు చేయకుడనిది, కానీ కొందరి కోసం ఇలాంటివి ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని విషపూరిత మొక్కలే. నిర్వాహకులు చక్కగా పార్క్ మాదిరి ఏర్పాటు చేశారు. ఇందులోకి వెళ్లి చూడాలి అంటే ఒక నియమం మాత్రం ఉంది, ఏ మొక్కను ముట్టుకోకూడదు అని ముందుగానే మాట ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి మొక్క ప్రపంచంలోనే ఎంతో విషపూరితమైన వృక్షజాతులకు చెందినవి. ఈ తోట బ్రిటన్ లోని నార్త్ అంబర్లాండ్ లో ఉంది.  
ఇక్కడ ప్రతి అడుగడుగునా ప్రమాద హెచ్చరికలు పుర్రె ఎముకలతో కనిపిస్తూనే ఉంటాయి. ఇందులోకి వెళ్లాలంటే వాళ్ళతో నిపుణులైన గైడ్ల ను పంపిస్తారు. ఇలా కాకుండా లోనికి అనుమతి ఇస్తే, వాళ్ళు మొక్కలు బాగున్నాయని ముట్టుకుంటే ఇక ఆసుపత్రికి కూడా వెల్లసిన పనిలేదు, సరాసరి స్మశానానికే వెళ్లొచ్చు, అంత ప్రదమైన తోట ఇది. అందుకే నిపుణులు తోడుగానే ఉంటారు. పొరపాటున కూడా వీక్షకులు మొక్కలను తాకకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ తోటలో మొక్కలు, పొదలు, చెట్లు, ఆయా మొక్కల పూలు, కాయలు, పండ్లు వీక్షకుల కళ్ళను కట్టిపడేస్తాయి. కనీసం పువ్వుల వాసన చూసినా ప్రమాదమే. ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉన్నప్పటికీ, కేవలం నిర్దిష్టమైన దూరం నుండి చూసి వచ్చేయాలి అంతే. 2005లో ఇది ఏర్పాటు చేయబడింది. గతంలో ఇక్కడ పదకొండో శతాబ్దానికి చెందిన కెసిల్ శిథిలావస్థకు చేరుకోవడంతో ఈ ప్రత్యేక విషపూరిత తోటను ఏర్పాటు చేశారు.  అయితే ఇది కూడా ఆకర్షణీయంగా ఉందని సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో, గైడ్లను ఖచ్చితంగా తోడుగా పంపిస్తూ వీక్షకుల కోరిక తీరుస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి మొక్క ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: