లైఫ్ స్టైల్: దీపావళి జరుపుకోబోతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

Divya
సాధారణంగా కొన్ని వర్గాల ప్రజలు అదేపనిగా దీపావళి పండుగ కోసం సంవత్సరమంతా ఎదురుచూస్తూ ఉంటారు.. ఈమధ్య కాలం అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా ఈ దీపావళిని చిన్న, పెద్ద, బంధుమిత్రులు అత్యంత సన్నిహితులతో కూడా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా దీపావళి అంటేనే ఆనందాల హరివిల్లు.. కొత్తబట్టలు.. గుమ్మంలో దీపాల కాంతులు.. చిన్న పెద్ద మోములో చిరునవ్వులు..ఇలా అంగరంగ వైభవంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.
అయితే ఈ పండుగ జరుపుకోవాలంటే..ప్రతి ఒక్కరు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇక మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..అనే విషయానికి వస్తే బాణాసంచా కాల్చేటప్పుడు ఎక్కువమంది జనసంచారం ఉండే ప్రదేశాలలో పేల్చడం సరికాదు.. ఈ విషయాన్ని మీ పిల్లలకు అర్థమయ్యేలా స్పష్టంగా తెలియజేయాలి. అంతేకాదు ఆస్పత్రులు, పెట్రోల్ బంక్ లు , బస్టాండ్లు పార్కులు ఇలా జనసంచారం ఉన్న ప్రదేశాలలో టపాసులు కాల్చడం వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది.. అందుకే ఇలాంటి ప్రదేశాలలో టపాసులు కాల్చడం వంటివి చేయరాదు.
దీపావళి రోజున మీ చిన్న పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండండి.. ఒకవేళ  నిర్లక్ష్యం వహిస్తే..ఆ బాధ కుటుంబం పైనే పడుతుంది.. కాబట్టి టపాసులు కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్త ఉంటూనే , ఇతరులకు కూడా జాగ్రత్తలు తెలియజేయాలి. అంతేకాదు వేసుకునే దుస్తుల లో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా పిల్లలకైతే సింథటిక్ వస్త్రాలు,సిల్క్ వస్త్రాలు  కాకుండా కాటన్ వస్త్రాలు వేయాలి. అంతేకాదు పట్టువస్త్రాలు ధరించినా కూడా ప్రమాదమే.. కాబట్టి వీలైనంత వరకు కాటన్ వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి.
కొంతమంది ఈ టపాసులు కాల్చేటప్పుడు చాలా దగ్గరగా ఉండి, కాలుస్తూ ఉంటారు.. మరికొంతమంది అయితే చేతిలో పెట్టుకొని మరీ కాలుస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఒక్కోసారి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది .. కాబట్టి వీలైనంత వరకు దూరంగా ఉండి టపాసులను కాల్చాలి.. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఈ దీపావళి పండుగను మీ జీవితాలలో మరింత దీపాలు వెలిగే లాగా చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: