దుబాయ్ లో పార్కులు... మళ్లీ మళ్లీ చూడాలన్పించడం ఖాయం

Vimalatha
దుబాయ్ అనగానే బంగారం, ఆకాశహర్మ్యాలు, కృత్రిమ బీచ్‌ లు మాత్రమే గుర్తొస్తాయి. కానీ దుబాయ్ అంటే ఇవి మాత్రమే కాదు అంతకంటే ఎక్కువగా ఇక్కడ గ్రీనరీని అభివృద్ధి చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకోవడానికి గ్రీన్ స్పేస్‌లను ఎక్కువగా పెంచుతున్నారు. దుబాయ్‌లోని అత్యంత ప్రసిద్ధ పార్కులు ఎప్పుడైనా చూశారా ? ఒక్కసారి చూశారంటే మళ్ళీ మళ్లీ చూడాలన్పించడం ఖాయం.
జుమైరా బీచ్ పార్క్
ఈ పార్క్ ఎమిరేట్స్ హాస్పిటల్ ఎదురుగా జుమైరా బీచ్ రోడ్‌లో ఉంది. ఈ బ్రహ్మాండమైన పార్క్ వారాంతంలో కుటుంబ విహారయాత్రలకు అనువైనదని భావిస్తుంటారు.
అల్ మమ్జార్ బీచ్ పార్క్
ఈ అందమైన బీచ్ పార్క్ ప్రసిద్ధ అల్ మమ్జార్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. ఈ పార్క్ ను 1994 లో నిర్మించారు. అప్పటి నుండి ఇది నగరంలోని బెస్ట్ బీచ్ పార్కులలో ఒకటి.  ఎంతోమంది పర్యాటకులకు ఈ పార్క్ అందమైన అనుభవాలను ఇస్తోంది.
దుబాయ్ క్రీక్ - క్రీక్‌సైడ్ పార్క్ బర్ దుబాయ్
ఈ ఉద్యానవనం దుబాయ్‌లో రెండవ అతి పెద్ద ఉద్యానవనం. పాత నగరం నడి బొడ్డున దుబాయ్ క్రీక్ ఒడ్డున ఉంది. ఇది నగరంలోని పురాతన ఉద్యానవనాలలో ఒకటి. ఇక్కడ పిల్లలతో పాటు పెద్దలు కూడా కాలక్షేపం చేస్తుంటారు.
జబీల్ పార్క్
దుబాయ్‌ లోని అతి పెద్ద పార్కులలో ఒకటైన జబీల్ పార్క్ షేక్ జాయెద్ రోడ్‌లో అల్ కర్మ అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మధ్య ఉంది. ఇది బేలోని మొట్ట మొదటి టెక్నాలజీ ఆధారిత పార్కుగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఉద్యానవనం చాలా విస్తారంగా ఉంది. ఈ పార్క్ 45 ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. ఈ అందమైన తోటలో 7000 కంటే ఎక్కువ తాటి చెట్లు, 7000 ఇతర చెట్లు ఉన్నాయి.
అల్ సఫా పార్క్
1975 లో స్టార్ట్ చేసిన అల్ సఫా పార్క్ నగరంలోని పురాతన పార్కులలో ఒకటి. దుబాయ్ లోని ఈ అందమైన గ్రీన్ గార్డెన్ 64 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. షేక్ జాయెద్ రోడ్‌లో ఉన్న ఈ గ్రాండ్ అర్బన్ పార్కు సరిహద్దులో అల్ వాసల్ రోడ్, అల్ హదిక స్ట్రీట్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: