తడిస్తేనే.. తిండి.. !

అదొక హోటల్, తడిస్తేనే తిండి దొరుకుతుంది. అంటే ఆ హోటల్ ఉన్నదే ఒక నదికి ఒడ్డున, అందుకే అక్కడ ఎప్పుడూ నీళ్లు మోకాళ్ళ లోతు ఉంటాయి. ఇటీవల ఇలాంటి కొత్త కొత్త అనుభవాలను ప్రజలు కోరుకుంటున్నారు. అందుకే ఇలాంటి వింతైన వాతావరణంలో హోటల్ లు నడుస్తున్నాయి. మొదలు పెట్టె ముందు నడుస్తుందా లేదా అనే సందేహం వచ్చి ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం ఇదే ట్రెండ్ అంటున్నారు. ఇలాంటి వారికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండటం వలన వినియోగదారులు కూడా బారులు తీరుతున్నారు. వినియోగదారులు ప్రత్యేకతను కోరుకుంటున్నందున హోటల్ యజమానులు కూడా వారికి తగ్గట్టే తమ తమ వ్యాపారాలను తీర్చిదిద్దుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే థాయిలాండ్ లో ని ఒక నది ఒడ్డున ఈ తరహా హోటల్ ఒకటి ఏర్పాటు చేయబడింది. అక్కడ ఏది తినాలి అన్నా కూడా నీళ్లలో దిగాల్సిందే. కూర్చోడానికి టేబుళ్లు కూడా నీళ్లలోనే ఉంటాయి. వాటిపైనే కూర్చున్నప్పటికీ కాళ్ళను నీళ్లు తాకుతూ పోతుంటుంది. ఇలాంటి అనుభూతి బాగుందని అక్కడకు వచ్చిన వాళ్ళు అంటున్నారు. అందుకే ఇప్పుడు ఇది అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందిన హోటల్. అక్కడకు వచ్చే యాత్రికులకు అయితే మరి నచ్చింది. కనీసం ఒక్కసారైనా పర్యాటకులు ఈ హోటల్ ను సందర్సించ కుండా థాయిలాండ్ విడిచి వెళ్లారు.
నది ఒడ్డున నాలుగు టేబుళ్లు, ఒక్కో టేబుల్ కు ఇరువైపులా రెండు కూర్చోడానికి ఏర్పాటు చేసిన టేబుల్స్. వాటి వరకు రావడానికి కూడా వడ్డించే వాళ్ళు నుండి అవి ఆరగించే వారు కూడా నీళ్లలో తడుస్తూనే ఉండాల్సిందే. పొరపాటున వస్తువులు మరిచిపోయి కింద పెట్టాలని ఆలోచిస్తే అంతే, అక్కడి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టే. అయినా పర్యాటకులు బాగా ఇష్టపడుతున్నారు ఇక్కడ ఆరగించేందుకు. రానురాను పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువగా ఉందని నిర్వాహకులు కూడా అంటున్నారు. వారు తమ కాళ్ళను నీళ్లు తాకుతూ పోతుంటే కలిగే అనుభూతిని ఆస్వాదిస్తున్నారని నిర్వాహకులు చెపుతున్నారు. ఈ నీళ్లలో నే పర్యాటకులకు సర్వింగ్ చేసేందుకు కొత్తలో ఇబ్బంది పడ్డా ప్రస్తుతం అలవాటు అయిపోయింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: