అలవాటు కాదు.. ఫోటో పట్టించేసింది.. !

ఒక్కొక్కసారి పనులు చేసేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు జరుగుతు ఉంటాయి. అవి చూసేందుకు చిన్నగా ఉన్నప్పటికీ ప్రభావం మాత్రం పెద్దగా ఉంటుంది. ఎంతలా అంటే, పోలీసులు సాధారణంగా చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది, నేరస్తుడు ఎంత తెలివిగలవాడైన ఎక్కడో అక్కడ చిన్న పొరపాటు చేస్తాడు, అదే అతడిని పట్టించి వేస్తుంది.. అని, అదే విధంగా ఉంటుంది ఆ చిన్న తప్పు ప్రభావం కూడా. అలాగే ఫేస్ బుక్ అనేక సందర్భాలకు భూమికగా ఉంటుంది. అంటే దానిద్వారా ఎక్కడెక్కడి వారితోనో మాట్లాడుతున్నారు, అమ్మకాలు చేస్తున్నారు, ఇంకా ఎన్నో చేస్తున్నారు. అలాంటి ఫేస్ బుక్ లో ఒక ఫోటో వచ్చింది, ఒక వస్తువు అమ్మకానికి కలదు అనేది దానిలో ఉన్న సారాంశం.
ఈ ఫోటో అనుకోని పరిస్థితులలో పోలీసులు కూడా చూశారు, అయితే అది ఎవరు పెట్టారు అనేది దర్యాప్తు చేసి తెలుసుకున్నారు, అక్కడకు చేరుకొని ఆ ఫోటో పెట్టిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చి అసలు విషయం చెప్పేంతవరకు కూడా  అతగాడికి తాను చేసిన పొరపాటు  అర్ధం కాలేదు. ఒక్కసారి తాను ఫేస్ బుక్ లో పెట్టిన ఫోటో ను క్షుణ్ణంగా ఒకసారి చూసుకున్నాడు. అంతే విషయం అర్ధం అయ్యింది. తాను అమ్మకానికి పెట్టిన వస్తువు ను ఫోటో తీసే సమయంలో పక్కనే ఉన్న మాదకద్రవ్యాల ప్యాకెట్ కూడా అందులో పడింది. దానిని చూసే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  
విషయం ఇంత దూరం వచ్చాక గాని అతగాడికి కూడా తాను చేసిన తప్పిదం అర్ధం కాలేదు. అయినా ఏమి చేస్తాం, పోలీసులు డ్రగ్ కేసు నమోదు చేసి అతగాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇల్లు సోదా చేసిన పోలీసులకు 48 గ్రాముల మెత్ తో పాటుగా లైసెన్స్ లేని తుపాకీ ఒకటి దొరకడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. అతడు అమెరికా వాడు, పేరు జేమ్స్. ఇంతకూ తాను అమ్మదలచిన వస్తువు, వాహనాలలో ఉపయోగించే కేటాలిటిక్ కన్వర్టర్. దానిని ఫోటో తీస్తుంటే పక్క బల్లమీద ఉన్న డ్రగ్స్ ప్యాకెట్ కూడా ఫొటోలో పడింది, అది గమనించకుండానే ఫేస్ బుక్ లో పెట్టేసి అధికారులకు దొరికిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: