ప్రకృతి బీభత్సం.. భారీ ఎత్తున లావా.. !

సాంకేతిక పరిజ్ఞానము పేరుతో మనిషి ప్రకృతిని నాశనం చేస్తుంటే, ప్రకృతి కూడా అదే స్థాయిలో మనిషిని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంది. ఇప్పటికే సహజమైన అనేక వనరులు కలుషితం అయిపోయాయి. వేడి పెరిగిపోతుంది, స్వచ్ఛమైన గాలి కూడా లభించడం లేదు. ఎటు చూసినా భూకంపాలు, సునామీలతో ప్రపంచం అతలాకుతలం అవుతూనే ఉంది. ఇదంతా మనిషి అత్యాశ వలననే వచ్చిన ప్రమాదాలు అంటున్నారు నిపుణులు. తాజాగా స్పానిష్ లోని పాల్వా ద్వీపం లో భూకంపం వచ్చింది. అటుతరువాత ఒక్కసారిగా లావా ఎగసిపడటం మొదలైంది. ఈ లావా కూడా మూడు అంతస్తుల ఎత్తుకు ఎగసిపడుతూ అందరిని భయబ్రాంతులకు గురిచేస్తుంది.
మాజో, ఫ్యూన్కళియంట్, ఎల్ పాసో అనే గ్రామాలలో ఈ భూకంపం సంభవించింది. కుంబ్రే వైజా అగ్నిపర్వతము భూకంపం వలన వేడి శిలా ద్రవం తాకడంతో అది పేలినట్టు తెలుస్తుంది. అదే స్థానిక భావనాలపైకి వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే పరిస్థితులను అదుపు చేయడానికి సహాయకబృందం రంగంలోకి దిగింది. ఈ లావా వేడి 1240 డిగ్రీలసెల్సియస్ వరకు ఉంది. ఇది టోడోకో గ్రామం సరిహద్దులలో కొన్ని ఇళ్లను ధ్వంసం చేసింది. అగ్నిపర్వతం పైభాగం కూలిపోవడం వలన దానిప్రభావము బాగా పడుతుందని, అందుకే లావా బాగా ఎగసి పడుతుందని అధికారులు అంటున్నారు.
ఈ లావా ఇప్పటికే పారిశ్రామిక వాడను, అక్కడే ఉన్న కొత్త భవనాలను తాకింది. ఇది గత నెల 19 నుండి లావా వెదజల్లుతున్నప్పటి నుండి దాదాపు 1186 భవనాలను ధ్వంసం చేశాయని అధికారులు తెలుపుతున్నారు. ఈ లావా వెదజల్లే ప్రదేశంలో 83000 మంది నివసించేవారు. అందులో 6000 మందికి ప్రమాద స్థాయి తీవ్రంగా ఉండటంతో వారిని ఖాళీచేయించారు. తాజాగా విస్ఫోటనతో పాటుగా మెరుపులు కనిపిస్తున్నాయని స్థానికులు చెపుతున్నారు. ఈ పరిస్థితి చక్కబడేవరకు ఎవరు ఇళ్లు వదిలి బయటకు రావద్దని ఆంక్షలు అక్కడ అమలులో ఉన్నాయి.  అగ్నిపర్వతం చల్లబడితే తప్ప ఇతర చర్యలకు పూనుకోవడం కుదరదు. ప్రస్తుతానికి నిర్వాసితులను వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: