వాషింగ్టన్ : గబ్బి పెటిటో ది .. హత్యే ..

సాంకేతిక విప్లవం వలన ఉపయోగాలు కూడా అప్పుడప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంటే ఒక సాంకేతికత చేతిలో ఉంటె దానిని సరైన విధంగా ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది ఇలాంటి సందర్భాలలో తెలుస్తుంది. ఇటీవల అమెరికాలో ఎఫ్బిఐ ఛేదించిన గబ్బి పెటిటో కేసు గురించి ఈ సందర్భంలో చెప్పుకోవాలి. సామజిక మాధ్యమాలలో కొందరు ఈమె కనిపించకుండా పోయిన విషయాన్ని బాగా ప్రచారం చేశారు. దీనితో ఎఫ్బిఐ పై ఒత్తిడి పెరగడంతో విచారణ వేగవంతం చేశారు. ఈ విచారణలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ చేతిలో హత్యకు గురైనట్టు తేల్చారు.
22ఏళ్ళ గబ్బి పెటిటో తన బాయ్ ఫ్రెండ్ లాండ్రీ తో రోడ్ ట్రిప్ కు వెళ్ళింది. అక్కడ ఈ హత్య చోటుచేసుకొని ఉండవచ్చు అని ఎఫ్బిఐ అనుమానం వ్యక్తం చేసున్నారు. దర్యాప్తు సంస్థ కేసును విచారించే ప్రక్రియలో వ్యోమింగ్ సరిహద్దులలో మానవ అవశేషాలను గుర్తించారు. అవి గబ్బి పెటిటో వి అయి ఉండవచ్చని వారు భావిస్తున్నారు. వారు చెప్పిన కధనం ప్రకారం, ఫ్లోరిడాకు చెందిన గబ్బి పెటిటో పోయిన నెలలో (ఆగష్టు) తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వ్యోమింగ్ లోని గ్రాండ్ టెటాన్ పార్క్ కు వెళ్ళింది. అనంతరం జరిగిన పరిణామాలు ఏవైనప్పటికీ సెప్టెంబర్ 1న లాండ్రీ మాత్రమే ఇంటికి తిరిగివచ్చాడు.
అప్పటి నుండి గబ్బి పెటిటో ఆచూకీ లేదు. తన బాయ్ ఫ్రెండ్ లాండ్రీ ని ఎన్నిసార్లు దీనిపై ప్రశ్నించినా మౌనం తప్ప సమాధానం దొరకలేదు. దీనితో ఆందోళనకు గురైన గబ్బి తలిదండ్రులు అధికారులకు పిర్యాదు చేశారు. అధికారుల విచారణ లో కూడా లాండ్రీ నోరు విప్పకపోవడంతో గబ్బి ఆచూకీ తెలిసినవే వారు చెప్పాల్సిందిగా అధికారులు ఆయా ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేశారు.  ఈ విచారణలో భాగంగానే వ్యోమింగ్ సరిహద్దులో వెతుకుతుండగా అక్కడ మానవ అవశేషాలు గుర్తించారు అధికారులు. అవి గబ్బికి సరిగ్గా సరిపోతుండటంతో ఆమెది హత్యగా తేల్చారు. ఇది తెలిసిన లాండ్రీ పరారయ్యాడు. అతడు దొరికితే కానీ ఈ హత్య వెనుక గల కారణాలు తెలిసిరావని అధికారులు చెబుతున్నారు. టిక్ టాక్ లో ఈమె కోసం గాలింపు జరపాలని ప్రచారం చేయగా, దానికి 650 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: