ప్రేమకు .. పెద్ద'అభిషేకం' ..

ఇవాళరేపు ప్రేమించడం, పెద్దలు ఒప్పుకోలేదని పారిపోవడం చాలా సహజం అయిపోయింది. ప్రేమించే ముందు ఆలోచన ఉండదు, అనంతరం పెద్దలు అంగీకరించరు అనేది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అప్పుడు చేసేది లేక చాలా మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. కొద్ది మంది  మాత్రం ప్రేమ చిగురించిన తరువాత కూడా బాధ్యతగా తమ చదువులు పూర్తిచేసుకొని, ఉద్యోగాలు వచ్చిన తరువాత పెద్దలతో మాట్లాడి అప్పుడు అడుగు ముందుకు వేస్తున్నారు. పెరిగిన సాంకేతికత తో పిల్లల దగ్గర కూడా మొబైల్స్ ఉంటున్నాయి. దానితో రోజులో ఎక్కువ శాతం ఫేస్ బుక్ లాంటి సామజిక మాధ్యమాలలో ఉంటున్నారు. అక్కడ ఎవరో తెలియని వారితో ప్రేమ లో పడటం అనంతరం మోసపోవడం లాంటివి రోజూ చూస్తూనే ఉన్నాము.
సాంకేతికత కారణంగా పదో తరగతిలోనే ప్రేమ దోమ కుడుతుంది. దానితో ఆ వయసులోనే ప్రేమ పేరు చెప్పి ఇళ్లు వదిలి వెళ్లిపోతుండటం లాంటివి కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇందుకు కొందరు అదృష్టం కొద్దీ పోలీస్ స్టేషన్ వరకు రావడం వలన మోసపోయినట్టు తెలుసుకొని మళ్ళీ ఇళ్లకు చేరుతున్నారు. ఎక్కువ శాతం మంది మోసపోయి చేసేది లేక వ్యభిచారం లాంటివాటిలో మగ్గిపోతున్నారు. ప్రేమ పేరుతో సామజిక మాధ్యమాలలో వలవేసి పట్టుకుంటున్న ప్రబుద్ధులు చాలా మంది తయారవుతున్నారు. వాళ్లకు చిక్కితే ఆ అమ్మాయిని ఎంతోకంతకు అమ్మేసుకోని వాళ్ళ పబ్బం గడిపేసుకుంటున్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ పరిస్థితి మాత్రం మారడం లేదు.
ఇక ఈ జాడ్యం గ్రామాలను కూడా తాకుతుంది. ఒక గ్రామంలో ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోవటం లేదని ఊరు విడిచి పారిపోయింది ఒక జంట. ఇద్దరు కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు నమోదు కావడంతో పది రోజుల తరువాత ఇద్దరు మళ్ళీ ఊరికి వచ్చేశారు. ప్రేమించుకుని వెళ్ళిపోయినట్టు తెలుసుకున్న గ్రామస్తులు పంచాయితీ పెట్టి ఇద్దరినీ శిక్షించారు. పెద్దలు పంచాయితీలో తీర్మానించుకుని ఇద్దరినీ చితక్కొట్టారు, ఇద్దరి మెడలో టైర్ లు వేసి విచిత్ర నాట్యాలు చేయించారు. వీరికి సాయం చేసినట్టు తెలిసిన 13 ఏళ్ళ అమ్మాయిని కూడా ఇంతే కఠినంగా శిక్షించారు పంచాయితీ పెద్దలు. పెద్దలు చేసిన పనిని అక్కడే ఉన్న ఒకరు వీడియో తీసి సామజిక మాధ్యమాలలో పెట్టారు. ఇక్కడ తప్పెవరిది అనేదానికంటే, ప్రేమ పేరుతో మోసపోకుండా ఇళ్లకు చేరడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: