లైఫ్ స్టైల్ : కడుపులో మెలిపెట్టినట్టు వుందా..? అయితే ఈ వంటింటి చిట్కా ట్రై చేయండి..!

Divya
కడుపు నొప్పి అనేది అతి భయంకరమైన సమస్యగా కొంతమందిలో మారుతోంది.. కడుపు నొప్పి వచ్చినప్పుడు చాలామంది భరించలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.. ఇకపోతే పంటి నొప్పి నుంచి కాలు నొప్పి వరకు ఏ సమస్యకైనా వంటింట్లో దొరికే పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు అన్న విషయం బహుశా చాలా మందికి తెలియదేమో.. భారతదేశ వంటిల్లు.. ఇలాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెడుతుంది.. ఇప్పుడు కూడా తీవ్రమైన మెలి పెట్టినట్టు కడుపు నొప్పి వస్తూ ఉంటే, వంటింట్లో దొరికే ఈ దివ్యౌషధాలతో ఒకసారి ప్రయత్నించి చూడండి..

1. ఎవరైనా భరించలేనంత కడుపునొప్పితో బాధపడుతున్నపుడు 10 గ్రాముల యాలకుల పొడిని తీసుకొని  నీటిలో కలిపి తాగాలి. లేకపోతే నీళ్లలో నానబెట్టిన యాలకులను మెత్తగా  రుబ్బి తీసుకున్న సరిపోతుంది.
2. కాకరకాయ ను వారానికి ఒక సారి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు చనిపోయి, కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉండదట.
3. కనీసం మూడు నెలలకు ఒకసారైనా శరీరమంతా పసుపు పట్టించి స్నానం చేయడం వల్ల, శరీరం మీద వచ్చే అలర్జీ లతోపాటు అవాంఛిత రోమాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ కాలంలో నువ్వుల నూనె లో కలిపిన పసుపు పట్టించి స్నానం చేయడం వల్ల మేని ఛాయ కూడా పెరుగుతుంది.
4. ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ కడుపు నొప్పి తగ్గనట్లయితే ఇంగువను నీళ్లలో తడిపి, బొడ్డు మీద ఉంచడం వల్ల కాస్త ఉపశమనం కలుగుతుంది.
5. కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెతో కడుపు మీద లేదా బొడ్డు చుట్టూ అప్లై చేసి సుతిమెత్తగా మసాజ్ చేయడం వల్ల, కొంత వరకు రిలీఫ్ కలుగుతుంది అని వైద్యులు చెబుతున్నారు.
6. సాధ్యమైనంత వరకు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి,  ఇంట్లో తయారు చేసే నూనె తక్కువ కలిగిన ఆహార పదార్థాలను సేవించడం వల్ల కడుపు నొప్పి నుంచి బయటపడవచ్చు.
చూశారు కదా ..!ఈ చిట్కాలు పాటించి చూడండి.. ఎంతటి తీవ్రమైన కడుపు నొప్పి అయినా సరే ఇట్టే పరార్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: