స్ఫూర్తి : మురళి 'దివీస్' .. విజయాలు ..

జీవితంలో నిరాశానిస్పృహలు తలెత్తినప్పుడు స్ఫూర్తి దాయకంగా విజయాలు సాధించిన వారి గాధలు వినడం వలన మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకోవచ్చు. చరిత్రలో గొప్ప విజేతలుగా మిగిలిన వారందరు కూడా ఒక స్థాయిలో దారులు అన్నీ మూసుకుపోయి ఎటు తోచక మిగిలిన వారే. చాలా కొద్ది మంది మాత్రమే పిత్రార్జితమైన విజయాలను కొనసాగిస్తూ ముందుకు పోతుంటారు. అయితే మొదటి నుండి ఏమి లేని వారు కష్టంతో శ్రమతో తెలివితేటలతో ఒక గొప్ప స్థాయిని సాధించుకున్న వారి గురించి తెలుసుకోవడంలో మనసు ఉత్సాహాన్ని పొందటమే కాకుండా అలాంటి వారి గురుంచి తెలుసుకునే క్రమంలో మనకు మంచి లక్ష్యాలు మనసులో ఏర్పాటయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్ఫూర్తిని ఇచ్చే దివీస్ లాబ్స్ వ్యవస్థాపకుడి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
మురళి దివి. ఈయన కూడా ఇంటర్ తప్పిన వారే, కానీ అక్కడితో ఆగిపోకుండా జీవితాన్ని చక్కదిద్దుకున్నారు కాబట్టి నేడు 72వేలకోట్లకు అధిపతి అయ్యారు.  ఆంధ్రప్రదేశ్ మచిలీపట్టణం ఆయన స్వస్థలం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు 12మంది సంతానం. నాన్నకు వచ్చే 10వేళ్లతోనే వీళ్లంతా బ్రతకాలి. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లలకు విద్యను అందించడంలో ఆ తండ్రి వెనకడుగు వేయలేదు. ఇంటర్ వరకు కూడా మురళికి కుటుంబ పరిస్థితిపై  పెద్దగా అవగాహన లేదనే చెప్పాలి. రెండు సార్లు ఇంటర్ తప్పడం ఆర్థికంగా మరింత భారంగా మారింది. అదికాక అందరు ఫెయిల్ అయిన విషయం చూస్తుండటంతో కాస్త ఇబ్బంది తెలుస్తుంది. అంతే అక్కడే జీవితం మొదటిసారిగా మలుపు తిరిగింది. అలాగని చదువు రాని వాడు కాదు, కేవలం ఆంగ్లబాషపై పట్టు సాధించలేక ఈ మాత్రం ఇబ్బంది ఎదురైందని అనేక సార్లు ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
అనంతరం బాగా చదివారు, మంచి ఉద్యోగం సాధించారు. ఉద్యోగం అమెరికాలో కావడంతో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. అయినా ఎక్కడో ఏదో అసంతృప్తి. దానితో స్వదేశానికి వచ్చేశారు. రావటం అయితే వచ్చారు కానీ ఎక్కడ నుండి ప్రారంభించాలో అర్ధం కాలేదు. అప్పుడే రెడ్డి లాబ్స్ ప్రారంభించారు. అందులో ఉద్యోగం సాధించారు. కొన్నేళ్లు అక్కడ ఉద్యోగం చేసిన తరువాత సొంతగా లాబ్స్ మొదలు పెట్టాలి అనే ఆలోచన రావడంతో దివీస్ లాబ్స్ తెరపై కి వచ్చేసింది. ఈ సంస్థ స్థాపించిన తరువాత వెనక్కి చూసుకోలేదు. స్థాపించిన 23 ఏళ్లలో బిలియనీర్ అయ్యారు. గత మూడు ఏళ్లలో ఈ లాబ్స్ విలువ 400  శాతం పెరిగింది. కరోనా సమయంలో ఫార్మా కు విలువ పెరగటంతో ఈ సంస్థ మరింత లాభాలు ఆర్జించింది. తాజా లెక్కలప్రకారం దివీస్ కుటుంబం 72వేల కోట్ల ఆస్తులతో(9.9బిలియన్ డాలర్లు) ప్రపంచంలో 384వ ధనవంతుడిగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: