వయసు ఎనిమిదేళ్లే .. చేతలు మాత్రం భేష్ ..

పసి వయసులో పిల్లలకు ఇచ్చే మానసిక స్తైర్యాన్ని బట్టే వారు ఎంచుకునే లక్ష్యాలు ఉంటాయని నిపుణులు చెబుతారు. తల్లి గర్భంలోనే ఉన్నప్పుడు 6నెలల వయసులోనే తల్లిదండ్రుల మాటలను వింటారని ఇప్పటికే వైజ్ఞానికంగా కూడా రుజువైంది. అందుకే ఇటీవల గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు తర్ఫీదు ఇస్తున్నారు. దీనితో వాళ్ళు పసివయసులోనే అనేక సాహసోపేతమైన గొప్పగొప్ప లక్ష్యాలు సాధిస్తున్నారు. అందుకే తల్లి గర్భంలో పిండం 6నెలలు రాగానే తల్లిదండ్రులు పిల్లలు వింటున్నారు అనేది గ్రహించి సరైన విషయాలు మాట్లాడుకోవడం అలవరచుకోవాలి అని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల ఇటువంటి తర్ఫీదు కేంద్రాలు కూడా ఎక్కువగా వెలుస్తున్నాయి. ఇలాంటివి చాలా వరకు పట్టణప్రాంతాలలో గమనించవచ్చు. గ్రామాలలో ఇప్పుడిప్పుడే ఇలాంటివి చేయడం మొదలవుతుంది. పట్టణాలలో అయితే ఇదొక వ్యాపారమ్ స్థాయికి పెరిగిపోయాయని చెప్పవచ్చు. తల్లిదండ్రులు కూడా పిల్లల కోసం వీటి గడపలు తొక్కడం చాలా సహజంగా జరిగిపోతుంది. దీనివలన పిల్లలు తెలివిగా తయారవుతున్నారనేది వారి వాదన కూడా. అందుకే వారు గర్భం దాల్చగానే ఇటువంటి కేంద్రాలకు క్యూ కడుతున్నారు. అంటే పిల్లవాడు పుట్టగానే నేడు పాఠశాలలో దరఖాస్తుకు పరిగెత్తినంత ఇదిగా ఈ కేంద్రాలకు తల్లిదండ్రులు బారులు తీస్తున్నారు.
ఇవన్నీ చేయకపోయినా మొదటి నుండి వారివారి ఇంటిలో వాతావరణాన్ని బట్టి సహజంగా తనపై నమ్మకంతో ముందుకు పోతున్న పసిప్రాయాలు కూడా లేకపోలేదు. అవన్నీ వారు పెరిగిన వాతావరణంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. తాజాగా ఎనిమిదేళ్ల బుడతడు పర్వతారోహణంలో ముందున్నాడు. అతడి తండ్రి ఒక ఐఏఎస్ అయినప్పటికీ పిల్లవాడితో సహజంగా వాతావరణ ప్రభావంతో భారీ లక్ష్యాలు పిన్న వయసులోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగా కృషి ఫలితంగా అతి పిన్న వయసులో ఇలాంటి సాహసోపేత లక్ష్యాలు సాగిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఈ బుడతడు మౌంట్ ఎల్ బ్రష్ శిఖరాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించి అందరిని ఆశ్చర్యపరిచాడు. తాను ఎవరెస్ట్ ఎక్కడమే తన లక్ష్యమని చెపుతున్నాడు. తండ్రి ప్రోత్సహంతో భువనగిరిలోని అడ్వెంచర్ అకాడమీలో తర్ఫీదు పొందుతున్నాడు ఈ బుడతడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: