లైఫ్ స్టైల్: ఇలా స్నానం చేస్తే ఎటువంటి నొప్పులు అయినా పరార్..!

Divya
ప్రస్తుత కాలంలో చిన్న, పెద్ద అనే తేడా ఏమీ లేకుండా ప్రతి ఒక్కరికి కాళ్ల నొప్పులు , కీళ్ల నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటూ ఏదో ఒక నొప్పులతో బాధపడుతూ ఉంటారు. ఇకపోతే రకరకాల స్నానాలతో చాలామంది ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రతి రోజూ స్నానం చేయడం వల్ల మనస్సు అలాగే శరీరం కూడా కొత్త ఉత్సాహాన్ని పొందడం తో పాటు హాయిగా ఆహ్లాదంగా కూడా ఉంటుంది.. ఇకపోతే ఎవరైతే ఒళ్ళు నొప్పులతో బాధ పడుతున్నారో , అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో స్నానం చేస్తే కచ్చితంగా ఎటువంటి నొప్పులు ఉండవట..

అదే పాద స్నానం.. స్నానం చేయడం వల్ల అరి కాళ్ళ నుంచి పిక్కల వరకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందట.. అయితే ఈ పాద స్నానం ఎలా చేయాలి అంటే..? ఒక బకెట్ లో కొద్దిగా వేడి ఎక్కువ ఉన్న నీటిని తీసుకోవాలి.. ఇంకొక బకెట్ లో కొంచెం వేడి తక్కువ  ఉన్న నీటిని తీసుకోవాలి. ఇప్పుడు వేడి ఎక్కువ ఉన్న నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ నీటిలో మీ పాదాలను ఉంచి ,మోకాలి కింది భాగం వరకు నీళ్లు తగిలేలాగా కూర్చోవాలి. ఇక వేడి నీళ్లు చల్లార గానే, మీ పాదాలను తీసి మామూలు వేడి నీళ్లు ఉన్న బకెట్ లో ఉంచాలి.

ఈ విధంగా రోజుకు 30 నిమిషాల పాటు పాద స్నానం చేయడం వల్ల కాళ్లు లాగడం, కాళ్ల నొప్పులు, పిక్క  నొప్పుల వంటివి త్వరగా తగ్గిపోతాయి.. సాధారణంగా స్నానం చేయకపోతే చర్మానికి సంబంధించిన వ్యాధులు రావడంతో పాటు చర్మంపై బ్యాక్టీరియా, దుమ్ముధూళి కూడా పేరుకుపోయి, చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.. అయితే స్నానం చేసే సమయాన్ని కూడా తక్కువ చేసుకోవాలి. ఎక్కువసేపు స్నానం చేయడం వల్ల కూడా ప్రమాదమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.. అతి తక్కువ సమయంలో ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆహ్లాదంగా కూడా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: