డ్రంక్ అండ్ డ్రైవ్ : ఊడమంటే .. పట్టుకెళ్లారే ..

సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతూనే ఉంది, కానీ ఎవరూ దానిని పాటించకపోవడం చూస్తూనే ఉన్నాం. ఈ డ్రైవ్ చేస్తున్న అధికారులకు రోజుకు ఒక అనుభవం ఎదురవుతుంది. అధికారులు నిర్వహిస్తున్న ఈ డ్రైవ్ లో ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తున్నారు. తాగి వాహనం నడపడం వలన ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది స్పష్టంగా చెపుతున్నప్పటికీ ఎవరూ మాట వినడం లేదు. రోజు అధికారులు దీనిపై అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడం, ప్రజలు మాత్రం తాగి వాహనం నడపడం జరుగుతూనే ఉంది. ఈ డ్రైవ్ చేసేప్పుడు ఆయా వ్యక్తుల ప్రవర్తన హాస్యంగా ఉండవచ్చు కానీ ఒక్కసారి అనుకోని ఘటన జరిగితే మళ్ళీ వీళ్లే అధికారులను నిందించడం మొదలుపెడతారు.
ఇవన్నీ ఎన్నో చూస్తూనే ఉన్న అధికారులు ఎప్పటి కప్పుడు ఆయా విషయాలపై అవగాహన అయ్యేట్టు చెపుతున్నప్పటికీ తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య తగ్గడం లేదు. ఇప్పటికే ఆయా సెలెబ్రిటీల ద్వారా కూడా ప్రజలలో అవగాహన తెచ్చేందుకు కూడా అధికారులు అనేక ఏర్పాట్లు చేశారు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ లో మళ్ళీ అదే సీన్. సిటీలో తాగటం కల్చర్ గా మారినప్పటికీ, తాగి వాహనం నడపడం వారికే ప్రమాదం, వారి కుటుంబానికి కూడా విషాదాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టంగా చెపుతున్నారు. ప్రత్యక్షంగా ఇలాంటి ఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.
ఇక తాజాగా మాదాపూర్ లో అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంలో వచ్చి పెద్ద గలాటా చేశారు. ఈ గలాటలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న మెషిన్ ను పట్టుకుని జర్రున పారిపోయారు. రాత్రి 11.45కి అధికారులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు, అప్పుడే యువకులు బైక్ పై అక్కడకు వచ్చారు. అధికారులు శ్వాస పరీక్షల నిమిత్తం నోట్లో మెషిన్ పెట్టి ఊదమన్నారు. అంతటితో  యువకులు మెషిన్ తీసుకోని ఉడాయించారు. అధికారులు ప్రయత్నించినా పట్టుకోలేకపోయారు. అంతే అప్పటి నుండి వెతుకుతూనే ఉన్నారు. ఇంతకీ మెషిన్ కోసం వెతుకుతున్నారో లేక యువకుల కోసం వెతుకుతున్నారో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: