లైఫ్ స్టైల్ : ప్రతిరోజు చికెన్ తింటే..ఇదే జరుగుతుందట..!

Divya
సాధారణంగా చాలా మంది మాంసం తినడానికి ఇష్టపడతారు.. తినే ముద్దలో చికెన్ ముక్క లేనిదే ఆరోజు భోజనమే చేయరు. ఇక మరి కొంతమంది చికెన్ అంటేనే యాక్ అని అంటారు. కొంతమంది శరీరంలో వేడి పెరుగుతుంది అని చికెన్ కు దూరంగా ఉంటారు.. ఇక ఇదంతా పక్కన పెడితే , ప్రతిరోజు చికెన్ తినే వారిలో ఈ మార్పులు కలుగుతాయని వైద్యులు సూచిస్తున్నారు.. మీరు కూడా రోజు చికెన్ తినే వారిలో ఒకరు అయితే మీలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలుసుకుందాం..

1. మనం రోజూ తినే ఆహారంలో ముప్పై ఆరు శాతానికి మించి ప్రోటీన్స్ ఉండకూడదు.. అంటే రోజుకు 50 గ్రాములు చికెన్ కు మించి తినడం వల్ల అధిక ప్రోటీన్స్ శరీరంలో నిల్వ ఉండిపోతాయి.. అధిక ప్రోటీన్స్ ను బాడీ కొవ్వు పదార్థాలుగా మార్చి శరీరంలోనే దాచి వేయడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ లెవెల్స్ పెరిగితే ఆరోగ్యానికి హానికరం.
2. ప్రతి రోజూ చికెన్ తినడం వల్ల బరువు పెరిగి మనిషి ఉబ్బినట్టు కనిపిస్తాడు . తద్వారా ప్రోటీన్స్ శరీరంలో ఎక్కువగా పేరుకుపోయి, అధిక బరువుతో గుండె సంబంధిత జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
3. చికెన్ మనం కొద్దిగా తిన్నప్పుడు అరగడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది.. కాబట్టి తద్వారా బరువు తగ్గుతారు. అదే ఒకవేళ చికెన్ ఎక్కువ తింటే ప్రోటీన్స్ ఫ్యాట్ గా మరి బరువు పెరుగుతారు.
4. చికెన్ తినేటప్పుడు ఎక్కువసేపు బాగా ఉడికించి , తర్వాత తినాలి..లేదంటే చికెన్ లో ఉండే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా వైరస్ కన్నా అత్యంత ప్రమాదాన్ని కలిగిస్తుంది.
5. కోళ్లు బరువు పెరగడానికి, బలంగా తయారవడానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు..కాబట్టి ఎక్కువగా చికెన్ తినడం వల్ల విషాన్ని తింటున్నామని గుర్తుంచుకోవాలి.
6. వారానికి ఒక సారి తక్కువ మోతాదులో చికెన్ తింటే ఎలాంటి ప్రమాదాలు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: