ప్రపంచంలో సూర్యుడు అస్తమించని 6 ప్రదేశాలు ఇవే !

Vimalatha
ఉదయం లేవగానే సూర్యోదయాన్ని చూడడం, అలాగే సాయంత్రం వేళల్లో కాఫీ తాగుతూ సూర్యాస్తమయాన్ని చూడటం చాలా బాగుంటుంది. ఎవరికైనా ఈ రెండూ ఆహ్లాదకరంగా అన్పిస్తయి. ఇక ప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతూ ఉంటాయి. అలాగే సూర్యుడు అస్తమించని ఈ ప్రదేశాలు కూడా ఈ భూమి మీద ఉన్నాయి. ప్రపంచంలో సూర్యాస్తమయం కానీ ఆరు ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నార్వే
నార్వే ఆర్కిటిక్ లో ఉంటుంది. ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని కూడా అంటారు. ఇక్కడ మే నుంచి జూలై మధ్యలో దాదాపు 70 రోజులు సూర్యుడు అస్తమించడు. నార్వేలోని స్వాల్ బార్డ్ లో ఏప్రిల్ 10 నుంచి ఆగస్టు 23 వరకు సూర్యుడు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాడు.
కెనడా
కెనడాలో ఉన్న చిన్న నగరం నునావుట్. కెనడాలోని వాయువ్య భాగంలో ఉన్న ఈ ప్రదేశంలో దాదాపు రెండు నెలల పాటు సూర్యుడు అస్తమించడు. శీతాకాలంలో మాత్రం ఏకంగా 30 రోజులు అక్కడ రాత్రి మాత్రమే ఉంటుంది.
ఐలాండ్
ఐరోపాలో ఉన్న అతిపెద్ద ద్వీపం ఐలాండ్.  గ్రేట్ బ్రిటన్ తర్వాత ఐరోపాలో ఉన్న అతిపెద్ద ద్వీపంగా ఐలాండ్ ను పేర్కొంటారు. ఇక్కడ జూన్ నెలలో మొదలు సూర్యాస్తమయం అనే మాటే ఉండదు. అర్ద రాత్రి కూడా సూర్యుడు కనిపిస్తాడు.
అలస్కా
అలాస్కా లోని బారో లో మే చివరి నుండి జూలై చివరి వరకు సూర్యుడు అస్తమించడు. కానీ నవంబర్ లో మాత్రం ఇక్కడ 30 రోజులు చీకటి గానే ఉంటుంది. దీనిని పోలార్ నైట్ అని కూడా పిలుస్తారు.
ఫిన్లాండ్
వేలాది సరస్సులు ద్వీపాల తో ఉన్న ఈ దేశం చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడ వేసవి కాలంలో 70 రోజుల పాటు సూర్యుడు అస్తమించడు. పైగా అందమైన హిమనీ నదాలు, మంచుపై స్కీయింగ్ ప్రధాన ఆకర్షణలు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: