అన్నం ఇలా తిన్నారంటే క్యాన్సర్, గుండె జబ్బులు తప్పవు

Vimalatha

భారతదేశంలో ఎక్కువగా ప్రజలు ప్రతి రోజూ తినే ఆహారంలో ముఖ్యంగా ఉండేది అన్నం. నార్త్ లో కన్నా సౌత్ లో అయితే మూడు పూటలూ అన్నాన్ని తినే వారున్నారు. అంతేకాదు బియ్యంతో వండే రకరకాల ఆహార పదార్థాలను దేశవ్యాప్తంగా ఇష్టంగా తింటారు. బిర్యానీ, పులావు, ఫ్రైడ్ రైస్, పులిహార, జీరా రైస్ వంటివి అందులో ముఖ్యమైనవి. కానీ అన్నం వండాల్సిన రీతిలో వండకుండా తినేవాళ్లకు క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందట.
అన్నం వండడానికి 4 సంవత్సరాల క్రితం జరిగిన పరిశోధనలో సరైనమార్గాన్ని కనుక్కున్నారు. సరైన మార్గంలో అన్నం వండితే క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని ఎలా తగ్గించవచ్చో పరిశోధన తెలిపింది.
అన్నం ఎలా ఉడికించాలి ?
నాలుగు సంవత్సరాల క్రితం అంటే 2017 లో ఇంగ్లాండ్‌లోని క్వీన్స్ యూనివర్సిటీ బెల్‌ఫాస్ట్ పరిశోధకులు అన్నం చేయడానికి సరైన మార్గం గురించి పరిశోధించారు. వారి ప్రకారం అన్నం చేయడానికి ముందు బియ్యాన్ని రాత్రిపూట లేదా కనీసం 3-4 గంటలు నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత అన్నం వండాలి. దీని కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమయ్యే టాక్సిన్స్ 80 శాతం వరకు తగ్గుతాయి.
అన్నంతో క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదం ఎలా ?
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం మట్టిలో ఎరువుల వల్ల టాక్సిన్స్, పురుగు మందులు ఉండటంతో బియ్యం కలుషితం అవుతాయి. దీని కారణంగా మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ కారకాలు అన్నంలో ఆర్సెనిక్ అనే టాక్సిన్ ను అధికంగా ఉత్పత్తి చేయడానికి దారి తీస్తాయి. ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
అన్నం తయారు చేసే ఈ 3 పద్ధతులపై ప్రయోగాలు
ఓ నివేదిక ప్రకారం విశ్వవిద్యాలయ పరిశోధకులు అన్నం వండే మూడు పద్ధతులను అధ్యయనం చేశారు. అందులో రాత్రిపూట లేదా 3-4 గంటలు నీటిలో నానబెట్టిన అన్నం తయారు చేసే పద్ధతి చాలా.ప్రయోజనకరంగా ఉంది. పరిశోధకులు మొదటి పద్ధతిలో మూడింట రెండు వంతుల నీటిలో ఒక భాగం అన్నం వండారు. మరొక పద్ధతిలో ఐదు భాగాలు నీరు, ఒక భాగం అన్నం వండారు. బియ్యం ఉడికిన తర్వాత గంజి వంచుతారు. ఈ రెండవ పద్ధతిలో హానికరమైన ఆర్సెనిక్ మొత్తం దాదాపు సగానికి తగ్గింది. అదే సమయంలో మూడవ పద్ధతిలో రాత్రి పూట బియ్యం నానపెట్టి వండారు. దీనిలో హానికరమైన కారకాలు 80 శాతం తగ్గినట్లు గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: