పెట్రోల్ కోసం .. ఆధార్, పాన్ వివరాలు అమ్మేసుకోకండ్రా ..

దేశంలో నిరుద్యోగం కావచ్చు మరొకటి కావచ్చు పెరిగిపోతుండటంతో రూపాయి విలువ ఉన్న వస్తువు అయినా  సరే ఉచితంగా లభిస్తుంది అంటే అది ఉపయోగ పడేదైనా కాకున్నా కూడా ప్రజలు క్యూ కట్టేస్తున్నారు. దేశంలో కరోనా వలన పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి. దీనితో కొందరు పెట్రోల్ పేరు చెప్పి వాళ్ళ అవసరాల కోసం ప్రజల సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రజలు కూడా మంచా చెడా అనేది కూడా ఆలోచించకుండా, లభించే వస్తువు కోసం పరుగులు తీస్తున్నారు. ఈ అలవాటు ఆసరాగా చేసుకొని చాలా మంది అనవసరపు ఆఫర్లు, డిస్కౌంట్స్ పెట్టి ప్రజల జేబుకు చిల్లు పెట్టేస్తున్నారు. అది అర్ధం చేసుకోలేక పోతున్నారా ప్రజలు అనేది ప్రశ్న.
అసలే ప్రపంచం సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది, మరోవైపు రాక్షస మూక రక్తం కళ్లచూస్తూనే ఉన్నారు. అయినా ప్రజలు తమ సమాచారం గోప్యతను పట్టించుకోవటం లేదు. అటు ఆన్ లైన్ ద్వారా కావచ్చు ఇటు ప్రత్యక్షంగా కావచ్చు సమాచార దోపిడీ ఈ ఆఫర్ల పేరు మీద కూడా జరుగుతూనే ఉంది. ఏ సమాచారం రాక్షసుల వద్దకు పోతుందో, ఎవరి ద్వారా పోతుందో తెలుసుకోడానికి ఒక వ్యవస్థ ఉన్నప్పటికీ సమాచార దోపిడీ జరుగుతుందంటే అది ప్రజల నిర్లక్ష్యం వలననే. వారు ముందు వెనుక చూడకుండా ఎవరు అడిగితే వాళ్లకు తమ సమాచారాన్ని ఇస్తూ పోతే అది పడకూడని చేతిలో పడితే తరువాత లబోదిబో మంటే మాత్రం ఎవరు కాపాడుతారు. తప్పు జరగకుండా జాగర్త వహించడం మన చేతిలోనే ఉంది, కానీ ఎప్పుడు శిక్షకు సిద్ధం అవుతున్నాం అంటే మనం ఎంత జాగర్తగా ఉంటున్నామో అర్ధం చేసుకోవాలి.
ఎవడో ఆఫర్ పెట్టాడని, లీటర్ పెట్రోల్ ఉచితంగా ఇస్తాను అన్నాడని మీ ఆధార్, పాన్ సమాచారం ఇచ్చి వస్తే; దానిని అతడు ఏ విధంగా ఉపయోగించనున్నాడో కనీసం తెలుసుకోకుండా వారడిగింది ఇచ్చేసి, పెట్రోల్ తెచ్చుకొని వాడేసుకున్నాక తీరిగ్గా ఆలోచిస్తారా..! ఇదా జాగర్త, ఒకవేళ మీ సమాచారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తే పరిస్థితి ఏమిటి..! ఇకనైనా మారదాం.. మన సమాచారాన్ని భద్రంగా చూసుకోవడం మన బాధ్యత  కూడా. అసలే రోజులు బాగాలేవని తెలుస్తూనే ఉంది కదా, ఆ మాత్రం జాగర్త లేకపోతే ఎలా. తరువాత ఏమైనా జరిగితే అధికారుల ను నిందించడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. మనం తప్పు చేసి వాళ్ళమీద నేరం మోపడం అంటే ఇదే. ఇకనైనా సమాచారాన్ని జాగర్త చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: