ఛాయ్,సమోసా ఇండియావి కాదా?

Manasa
సాయంత్రం 4 లేదా 5 అవ్వగానే గరం గరం చాయ్ తాగడం చాలామందికి  అలవాటు, వాటితో పాటు వేడి వేడి సమోసాలు ఉంటే ఏ మజానే వేరు. టీలు, కాఫీలు ఎంతలాగ మన లైఫ్ లో అలవాటు అయ్యాయి అంటే అది లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేను. మనకి ఇలా బాగా అలవాటు కొన్ని రుచులు అసలు ఇండియాలో పుట్టినవి కానే కాదు.వి మనవి అని మనం అనుకుంటున్నాము కానీ  పుట్టుపూర్వోత్తరాలు ఇక్కడివి కాదు అన్నమాట! టీ,కాఫీ, కాకుండా అలా మొత్తం మీద 11 ఆహారాలు ఉన్నాయి. అవి ఏంటో ఎక్కడి నుంచి మన భారతదేశంలో వచ్చాయి,వాటి సంగతి ఏంటో చూద్దాం...


ఛాయ్

అవును ఛాయ్ ఇండియాలో పుట్టింది కాదు,వాటి మూలాలు చైనాలో ఉన్నాయి. ఐటీ బ్రిటిష్ వారు భారతదేశంలో ఉన్నప్పుడు దాన్ని మనకు అలవాటు చేశారు.


జిలేబి

చాలా మందికి ఎంతో ప్రీతికరమైన స్వీట్. ఇది మిడిల్ ఈస్ట్ లో  ఉద్భవించింది.


ఇడ్లీ 

భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 10 అవుట్ ఆఫ్ 8 మంది బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ ప్రిఫర్ చేస్తారు.

ఇది  ఆరబ్స్ ద్వారా ఇండోనేషియా నుంచి ఇండియాకు వచ్చింది.


డాల్ రైస్ 

డాల్ అనేది మనకి చాలా సర్వసాధారణమైంది మరియు చాలా ముఖ్యమైనది. డాల్ బాట్ ఇండియన్ డిష్ కాదు, ఇది నేపాల్ లో ఉద్బవించింది.


గులాబ్ జామున్

గోల్ అంటే పువ్వు, అబ్ అంటే నీరు.  గులాబ్ జామున్  పెర్షియన్ పడాల నుంచి వచ్చిన పేరు. పర్షియన్లు దీన్ని  'లుక్మత్ అల్ ఖాది' అని పిలుస్తారు


బిర్యాని 

బిర్యానీ అంటే చాలామంది పడి చస్తారు, దేశవ్యాప్తంగా బిర్యాని చాలా ఫేమస్ కానీ దాని మూలాలు ఇండియాలో లేవు  అది పర్షియా లో ఉద్భవించింది.


ఫిల్టర్ కాఫీ 

ఫిల్టర్ కాఫీ ని సూఫీ సాధువు బాబా మక్కా తీర్థయాత్రలో ఉన్నప్పుడు కనుగొనారు. దాన్ని వేరే భారతదేశానికి పరిచయం చేశారు.

మోమోస్ 

మోమోస్ మన పొరుగు దేశహమ్ ఐన నేపాల్‌కు చెందినది.

 భారతదేశానికి తమ వాణిజ్య ప్రక్రియలో ఓచినపుడు నెవర్ వ్యాపారులు మోమోస్ తీసుకొచ్చారు. 


చికెన్ తిక్క మసాలా 

 చికెన్ తిక్క మసాలా స్కాట్లాండ్ వారు పరిచయం చేశారు.

నాన్ 

మనందరికీ ఎంతో ఇష్టమైన నాన్ పర్షియా లో ఉద్భవించింది 


సమోసా

మన చాలా రెగ్యులర్గా చూసే స్నాక్ సమోసా ఇది మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందినది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: