చవితి : కరోనా .. మా జేబుకు చిల్లు పెట్టావ్ కదే..

కరోనా ప్రపంచాన్నే కుదిపేస్తోంది, ఇక సాధారణ ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దానిపుణ్యామా అని ఎందరో రోడ్డుపైకి వచ్చేశారు, మరెందరో పనులు లేక పూట గడవక అల్లాడిపోతున్నారు. ఆయా సీజన్ లలో మాత్రమే పని చేసుకుంటూ బ్రతుకు నెట్టుకొచ్చే వాళ్లకు ఆ పని కూడా లేకుండా చేసింది కరోనా. ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, బ్రతుకు బండి లాగటం కోసం ఏదో ఒక పనిలో చేరిపోయారు. కరోనా ముందే కోటి ఆశలతో వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళు పూడ్చలేని నష్టాల ఊబిలో ఇరుక్కుపోయారు. ఈఎంఐ లు కట్టుకుంటూ బ్రతుకు నడిపే వారు ఉద్యోగాలు పోవటంతో సర్వం పోగొట్టుకునే స్థితికి వచ్చేశారు. ఇంకొందమందైతే తమవారిని పోగొట్టుకొని అనాధలుగా మిగిలిపోయారు. ఇన్ని ఉపద్రవాలకు కారణం కరోనా.
ఇది పండగల సీజన్, ఈ కొద్దికాలం వృత్తి, వ్యాపారాలు చేసుకొని జీవితాలు వెళ్లబుచ్చుకునే వాళ్ళు బోలెడు మంది. చెప్పాలంటే ఒక్క పండగ వస్తే దానిపై బ్రతికే వాళ్ళు ఎందరో ఉంటారు. ఉదాహరణకు ఈ వినాయక చవితినే తీసుకోండి, ఆయన విగ్రహాల తయారీ దారుల నుండి, దానికి కావాల్సిన వనరులు అమ్మేవారు కానివ్వండి, వాటికి అలంకారాలు చేసేవారు కానివ్వండి, పూజల నిమిత్తం ఆయా పూలు, గట్రా సామాగ్రి ఉత్పత్తిదారులు, వాటిని మండపాల వరకు తెచ్చేవారు కానివ్వండి, ఇక పూజలు చేసే పూజారుల వరకు ఎందరో ఈ ఒక్క పండగపై ఆధారపడ్డారు.
ఈ కరోనా చేయగా వీళ్ళందరూ బాధితులైనట్టే కదా. సాధారణ పరిస్థితులలో అయితే వీరందరికి కనీస ఆదాయం ఉండేది. ఇప్పుడు అది అంతా పాయె. రెండేళ్ల క్రితం మండపాలకు పూజారులు దొరకక, కుదిరిన వేళలో పూజలు నిర్వర్తించేవారు. కానీ ఇప్పుడు వీరికి ఆ ఆదాయం అంతా  పోయినట్టే కదా. బహుశా వీరందరూ కరోనా ను బాగా తిట్టుకోక మానరు. ఎప్పుడు ఈ సీజన్ లో ఎంతో బిజీగా ఉండే వీళ్లు ఈసారి మాత్రం పూజారులు గుళ్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే విగ్రహాల తయారీ దారులకు ఉద్దీపనలు ప్రకటించిన విషయం తెలిసిందే. తద్వారా వీరు కొంతైనా నష్టాల నుండి బయట పడతారు. వీరిని పట్టించుకుంటున్న ప్రభుత్వాలను శభాష్ అనకుండా ఎలా ఉండగలం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: