చవితి ఉత్సవాలకు .. కరోనా కోత ..

సాధారణంగా అయితే గణేష్ ఉత్సవాలు ధూమ్ ధామ్ గా జరిగేవి. అయితే గత రెండు సార్లుగా మాత్రం కరోనా కారణంగా పెద్దగా సంబరాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. సాధారణ భక్తుల నుండి సినిమాల వరకు అన్నిటిలో గణేషుడి ఉత్సవాలకు ప్రత్యేక స్థానం ఉంది. మిగిలిన ఏ పండుగలకైనా ఎవరికి వారే జరుపుకుంటే, ఈ ఉత్సవాన్ని మాత్రం అందరు కలిసి మతాలు కూడా మరిచి అందరు గణేష్ బప్పా మోరియా .. అంటూ హోరెత్తించేవారు. ఈసారి మాత్రం ఏర్పాట్ల వరకు వచ్చినా కార్యరూపం దాల్చలేకపోయింది. కారణం కరోనా రెండో దఫాలో దెబ్బ తిన్న ప్రజలు, మూడో దఫేను ఇంటి ముంగిటే పెట్టుకొని ఈ ఉత్సవాలు జరుపుకోలేకపోయారు.
అక్కడక్కడ కొద్దిపాటి హడావుడి తప్ప మునుపటిలా ఉత్సవాల సందడి ఎక్కడా కూడా లేదు. చాలా రాష్ట్రాలలో పూర్తిగా ఇంటికే పరిమితం చేయగా, కొద్ది రాష్ట్రాలలో అదికూడా కరోనా కాస్త తక్కువ ఉన్న వాటిలోనే ఉత్సవాల సందడి కనిపిస్తుంది. ఎప్పుడూ గణేష్ పండుగ వస్తుందంటేనే విగ్రహాల ఏర్పాటు కోసం నెలల ముందు నుండే ప్రణాళికలు వేసుకుంటుండే వారు భక్తులు. అనంతరం విగ్రహాన్ని మండపానికి తేవటం కూడా ఉత్సవం లాగానే జరిగేది. ఇక ఒక్కసారి చతుర్థి పూజ మండపాలలో మొదలైతే ఆయా గణేషులను దర్శించుకునేందుకు భక్తులు క్యూలు కట్టేవారు. వీరిని సముదాయించడం ఒక్కోసారి నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారేది, అప్పుడు చాలా సార్లు పోలీసు అధికారులు కూడా రంగ ప్రవేశం చేయాల్సి వచ్చేది.
ఇప్పుడు కూడా పోలీసులు ఉన్నారు, ఎక్కడైనా అనుమతి లేకుండా మండపాలు పెట్టినా లేక వాటివద్ద కోర్టు సూచించినట్టుగా ఐదుగురు కంటే జనాలు ఉండకుండా చూసుకుంటున్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు కరోనా ఈ ఉత్సవాలపై ఎంత ప్రభావం చూపిందో అని.  నిజానికి ఈ పరిస్థితులలో జనాలు బయట తిరగడానికే బయపడి చస్తుంటే, ఇలాంటి ఉత్సవాలు జరిపి ప్రాణాలమీదకు తెచ్చుకోవడం తెలివైన పని అనిపించుకోదు, కాబట్టి ఈసారి అయినా గణేష్ ఉత్సవాలు నిర్విఘ్నంగా ఘనంగా చేసుకోవాలని ఇళ్లలోనే ఆ గణనాధుడిని వేడుకుందాం. జై గణేష్ మహారాజ్ కి, జై.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: