భార్యాభర్తలు .. మధ్యలో పోలీసులు .. ఇదేందయ్యా ..

భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, అసల అవి ఉంటేనే జీవితం కాస్త సరదాగా సాగిపోతుంది, లేదంటే బోర్ కొట్టేస్తుంది. అలాగని ఎవరైనా భార్యాభర్తలు గొడవ పడుతుంటే మధ్యలోకి మాత్రం వెళ్ళకండి, వెళితే అంతే, వాడినే బలి చేస్తారు. తాజాగా ఈవిషయం మరోసారి రుజువైంది. ఇంట్లో భర్త, అత్తమామలతో ఏదో గొడవ పడి ఒక భార్య పోలీసులను ఆశ్రయించింది. అంతవరకు బాగానే ఉంది, ఆమె చెప్పినది విన్నారు అధికారులు. అయితే కేసు మాత్రం వేరే పాయింట్ లో పెట్టారు. దీనితో అదికాస్తా కోర్టులో జడ్జి గారికి కొత్త సందేహాన్ని తెచ్చిపెట్టింది.
ఇద్దరు మేజర్లు తమ ఇష్టానికి మత లేదా కులాంతర వివాహం చేసుకుంటే తప్పేమిటి అని న్యాయస్థానం అధికారులను ప్రశ్నించింది. అప్పుడు అసలు నిజం బయటకు వచ్చింది. అసలు భార్య తాను భర్త, అత్తమామలతో చిన్న గొడవ పడి పోలీసులను ఆశ్రయించాను. కానీ వాళ్ళు మతమార్పిడికి సంబందించిన కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు చెప్పింది. తనను భర్త కానీ, అత్తమామలు కానీ మతం మార్చుకోవాలని ఎప్పుడూ బలవంతం చేయలేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా, తనకు తెలియకుండానే అత్యాచార కేసులు కూడా నమోదుచేశారని చెప్పుకొచ్చింది. ఇది విని న్యాయమూర్తి కూడా ఆశ్చర్యానికి గురయ్యారు.
దేశంలో బలవంతపు మతమార్పిడి జరుగుతున్నట్టు గుర్తించిన అధికారులు వాటిని ఆపేందుకు 2021లో కొత్త చట్టం మతస్వేచ్ఛ(సవరణ) తెచ్చారు. ఈ చట్టం ప్రకారం, బలవంతంగా ఆయా మతాల వారిని వివాహం చేసుకోవడం ద్వారా లేదా వేరే విధంగా మత మార్పిడి జరగడం నేరం. ఈ నిబంధనలపై స్టే ఉన్నప్పటికి, కొందరు వీటిని అనుకూలంగా వాడుకుంటున్నారు. మతాంతర వివాహాల పేరుచెప్పి, ఆయా భాగస్వాములను వారివారి మతాలలోకి మారాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రేమ వివాహాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొందరు వివాహాలు కేవలం వారి మతంలోకి తమ భాగస్వామిని మార్చడానికి మాత్రమే చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. సాధారణ వివాహాలలో కుల లేదా మతాంతర వివాహాలైనప్పటికీ ఈ ఒత్తిడి ఉండదు. అందుకే ప్రేమ వివాహాలలో మతాంతర వివాహాలు ఉంటె కాస్త జాగర్తగా ఉండాలని సూచన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: