పెళ్ళిలో ఇవన్నీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

Manasa
ఎంత అప్డేట్ ఐన ఎంత ఆధునిక సంస్కృతిని అలవర్చుకున్న మన సనాతన ధర్మం యొక్క  అందం, విధానానికి జోహార్లు కొట్టాల్సిందే. మన సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు విదేశీయుల్ని చాలా ఆకర్షిస్తుంది. ఈ మధ్య విదేశీయులు కూడా మన రీతిలో పెళ్లిళ్లు జరుపుకుంటున్నారు. అంతేయ్ కాకుండా మన పద్ధతుల వెనుక ఉన్న పరమార్ధాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం  చేస్తున్నారు. సంప్రదాయాలు అన్ని తెలుసుకొని మరి వాటి ప్రకారంగా నడుచుకుంటున్నారు. మరి ఇంతకీ పెళ్ళి సమయంలో మనం చిత్తశుద్ధితో సంప్రదాయ విధులు నిర్వహించకుంటే తర్వాత ప్రశాంతత లేని జీవితం సాగించడానికి  కారణమవుతుందని మీకు తెలుసా?
అవును! "ఏడడుగుల బంధానికి పెద్దలు ఏడు సూత్రాలు తెలియజేశారు, మరీ ముఖ్యంగా ఆ ఏడు సూత్రాల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి." బంధానికి ఏడు పెళ్లి సమయంలో మనం ఎంత స్వచ్ఛమైన మనసు మరియు శ్రద్ధతో పద్ధతులు పాటిస్తామో  తర్వాత అవే దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.
ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుని ఇక ముందు జరగనీయకుండా జాగ్రత్త పడదాం
 
జీలకర్ర బెల్లం పెట్టాక వధూవరులు ఒకరినొకరు సరిగ్గా చుస్కోకపోవడం.
ఫలితం:- దీనివల్ల కలిగే నష్టం వారి మధ్య ప్రేమ తగ్గిపోవడం.
 
మాంగళ్య ముహూర్తానికి ప్రాముఖ్యత  ఇవ్వకపోవటం..
ఫలితం:- దీనివల్ల వచ్చే నష్టం మనోవైకల్యం, చిత్తచాంచల్యం, అన్యోన్యత లేకపోవడం, మంచి సంతానం పొందకపోవడం.
 
తలంబ్రాలకు బదులు థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవడం.
ఫలితం:- దీనివల్ల బంధు ద్వేషం, ఆర్థిక ఇబ్బందులు.
 
వధూవరులను ఆశీర్వదించేటపుడు బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోకి రావడం.
ఫలితం:- అలా చేయడం వలన మన మంటపంలో హోమం చేసి ఆవాహన చేసిన దేవతలు వెళ్లిపోయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి.
 
బఫే భోజనం.
ఫలితం:- బఫే భోజనాల వల్ల అన్నదాన ఫలితం ససేమిరా  దక్కదు.
 
సినిమా పాటల్లో లీనమైపోయి వేదమంత్రాలు వినకపోడం.
ఫలితం:- దీనివల్ల దైవ కటాక్షం దూరమవ్వడం.
 
ఇవే కాదు  ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి. అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంలో సంప్రదాయాలను అనుసరిస్తూ కళ్యాణం  జరుపుకొని , మంచి జీవితం గడుపుతూ,మంచి సంతానం పొంది,భగవంతుడి కృపకు పాత్రులుకండి ఇవన్నీ శాస్త్రంలో  ఒక నిర్దిష్ట లక్ష్యం కోసం ఏర్పాటు చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: