మీరు 30 ఏండ్లు దాటిన యువకుల.. ఈ విషయం తెలుసుకోండి..! లేకుంటే..?

MOHAN BABU
 ప్రస్తుత కాలంలో టెక్నాలజీ పెరిగింది. అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. మనిషి అనే వాడు ప్రాచీన సంస్కృతిని మరిచి, ప్రాశ్చాత్య  సంస్కృతికి అలవాటు పడుతున్నాడు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉన్నాడు. ఉన్నత చదువులు చదువుతున్నాడు. ఎంతో డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో  డబ్బు చుట్టే మనిషి జీవనం, డబ్బు చుట్టే మనిషి ప్రాణం, ఆ డబ్బు చుట్టే ప్రతిది తిరుగుతోంది. ఈ డబ్బు మాయలో పడి చాలామంది మోసపోతున్నారు. చంపు కుంటున్నారు. ఇంకెన్నో సృష్టిస్తున్నారు. అయితే పూర్వకాలంలో  మగవాళ్లకు 20 సంవత్సరాల లోపే వివాహం చేసేవారు. ఇక ఆడవాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉండేది. కానీ ప్రస్తుతం  యువత  30 సంవత్సరాలు దాటిన పెళ్లి ఊసే ఎత్తడం లేదు. సెటిల్మెంట్, సెటిల్మెంట్, సెటిల్మెంట్ ఈ ఒక్క సెటిల్మెంట్ పదం చుట్టే తన జీవితాన్ని తిప్పుతూ ఏజ్ బార్ అయి చివరికి పెళ్లి కానీ ప్రసాదుల్లా మారుతున్నారు.

డబ్బు సంపాదించాలి  సెటిల్ అవ్వాలి అన్న ఆలోచన తప్ప, పెళ్లి విషయాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు.  కానీ మనకు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరిగితే  బాగుంటుందని పెద్దలంటారు. కానీ ప్రస్తుత యువకులు ఆ మాటలు కొట్టిపారేస్తున్నారు. చివరికి యవ్వన వయసంత పోయిన తర్వాత పెళ్లిళ్లు చేసుకొని అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే కెరీర్ లో సెటిల్ అవడం అనేది చాలా మంచి ఆలోచన. కానీ దాని కంటు ఒక సమయం ఉంటుంది. ఆ సమయం తర్వాత నువ్వు సెటిల్ అయినా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అది ప్రస్తుతం మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల  మనిషి యొక్క ఆయు  ప్రమాణం కూడా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం  30 ఏళ్ల వయసు వచ్చేసరికి యువకులు ముసలి వాళ్ళలా రోగాల కుప్పల  తయారవుతున్నారు. కాబట్టి పాతిక సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో  దాదాపు స్థిరపడి పోవాలి. లేకపోతే లైఫ్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు.

అయితే ప్రస్తుత కాలంలో చాలా లేటుగా పెళ్లిళ్లు చేసుకుని  వారికి పిల్లలు పుట్టక అనేక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరైతే ఏదైనా ఉద్యోగం చేస్తూ అందులోనే మంచి పొజిషన్ రావాలని వేచి చూస్తూ తన యువ జీవితాన్నంతా అక్కడే గడిపి బి పి, షుగరు తెచ్చుకున్న తర్వాత పెళ్లిళ్లు చేసుకొని ఇబ్బందుల పాలవుతున్నారు. కొంతమందికి 30 సంవత్సరాల దాటేసరికి పూర్తిగా తలపై వెంట్రుకలు రాలిపోయి బట్టతల వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా సమాజంలో చాలామంది యువకులు, ఎదో సెటిలవ్వాలని  తన ఏజ్ అంతా అయిపోయే వరకు వేచి చూస్తూ పెళ్లి కానీ ప్రసాదులు గా మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: