లైఫ్ స్టై:ల్ఈ మొక్కలు ఉండడం వల్ల.. దోమలు ఇంట్లోకి రావు..?

Divya
వర్షాకాలంలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు, తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి , ప్రతి ఒక్కరు ఈ వర్షాకాలం అంటేనే భయపడుతూ ఉంటారు. వీటిని సీజనల్ ఫ్లూ అని కూడా అంటారు. అంతేకాదు ఇక దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది . ఈ దోమలు కుట్టడం వల్ల డెంగ్యూ , మలేరియా వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధమైన జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.. దోమల నుంచి తప్పించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే వివిధ రకాల లోషన్లను దోమలను వికర్షించే క్రీములను వాడుతూ, తమ శరీరాన్ని దోమల నుంచి కాపాడుకుంటూ ఉంటారు..
ఇవి కుట్టడం వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు కూడా ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక అయితే ముఖ్యంగా ఎక్కడ కూడా ఎక్కువగా నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తపడాలి. అంతే కాదు కొన్ని రకాల మొక్కలను కూడా ఇంట్లో పెంచుకోవడం వల్ల దోమల సమస్య ఉండదని చెబుతున్నారు కొంతమంది నిపుణులు..
బంతి పూలు ఇంట్లో ఎక్కడైనా పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువగా నీరు కానీ ఎరువు కానీ అవసరం లేదు కాబట్టి తక్కువ మొత్తంలో ని నీరు పోస్తూ వీటిని సులభంగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ చెట్లు మీ బాల్కనీ యొక్క అందాన్ని పెంపొందించడమే కాకుండా, వాసన రావడంతో పాటు దోమల్ని కూడా నివారించడానికి సహాయపడుతాయి.. కాబట్టి ఈ బంతి పూలను ఇంటి ఆవరణలో పెంచుకోవచ్చు.
వీటితో పాటు లావెండర్ మొక్కలు, తులసి మొక్కలు, రోజ్మేరీ మొక్కలు , గడ్డి మొక్కల వంటివి ఇంటి ఆవరణలో పెంచుకోవడం వల్ల దోమల కాటు నుంచి బయటపడవచ్చు. ఇక ఈ మొక్కలను ఇంట్లో  పెంచుకోలేము  అనే వారు మార్కెట్లో దొరికే ఈ పరిమళ ద్రవ్యాలను కూడా ఇంట్లో చల్లుకోవడం వల్ల వీటి నుండి దోమలు దూరం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: