లాటరీ .. పెళ్లి .. ఇదేం చోద్యం.. !

ఇటీవల నెట్ ప్రతివారికీ అందుబాటులోకి వచ్చేసింది, దానికితోడు స్మార్ట్ ఫోన్. ఈరెండు ఉంటె దాదాపు ప్రపంచం అంతా చేతిలో ఉన్నట్టే. ఇటువంటి అస్త్రాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోనూ వచ్చు. ఎక్కువ మంది దుర్వినియోగమే చేస్తున్నారు అందేది జగమెరిగిన సత్యం. చేతిలో స్మార్ట్ ఫోన్, దానిలో నెట్, ఇంకేముంది రోజు అంతా కూడా సామజిక మాధ్యమాలలో ఉండిపోవటం తోనే సరిపోతుంది చాలా మందికి. అక్కడ కూడా ఊరికే ఉండరు కదా, వారిని వీరిని గెలుకుతూ ఉంటారు. దానితో ప్రేమలు, మోసాలు వంటివి ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి సామజిక మాధ్యమాల ద్వారా ఈ తరహా విషయాలు రోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. అందులో అన్నీ వివాద భరితమైనవే, ఎక్కడో ఒకటీ రెండు మంచి విషయాలు ఉండొచ్చు.
అలాంటిదే ఈ లాటరీ వ్యవహారం. ప్రబుద్దుడు ఒకాయన సామజిక మాధ్యమాల ద్వారా వేర్వేరు ప్రాంతాలలో ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించాడు. వాళ్ళు కూడా ఇతగాడికి పడిపోయారు. ఇంత వరకు కాస్త బాగానే ఉంది. అక్కడితో ఆగకుండా ఆ ఇద్దరు ఈయన గారి కోసం రావటం, ఇద్దరు అనే విషయం బయట పడటం జరిగిపోయాయి. దానితో నాకు కావాలి అంటే నాకు కావాలి అని పోటీపడ్డారు ఆ మహారాణులిద్దరు. ఏదో అమ్మాయిలు తక్కువగా ఉన్నారు, వారి కోసం అబ్బాయిలు పోటీ పడ్డారు అంటే వినటానికి కాస్త బాగానే ఉంది, ఎందుకంటే అది నిజం కాబట్టి. కానీ ఈ అమ్మాయలు అతగాడి కోసం పోటీ పడటం ఎంతవరకు వెళ్లిందంటే, ఊరిలో పంచాయితీ పెట్టేశారు.
ఊరిలో పంచాయితీ అంటే తెలిసిందేగా, అందరు ఒకచోటకు చేరుతారు, అక్కడ పెద్దాయన ఇరువర్గాల వాదనలు వింటాడు. చివరకు తీర్పు చెప్తాడు. కానీ, ఇక్కడ ఆ తీర్పు కాస్త తేడాగా ఉంది. అంతా విన్న పెద్దలు చేసేది లేక లాటరీ పద్దతిలో ఎవరికి దక్కాలో తేల్చుకోవాలి అని చెప్పాడట. అంతే, మొత్తానికి నెట్ మూలకంగా, లాటరీ పెళ్లి జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే, ఈ రాణులలో ఒకరు ఇతగాడి కోసం విషం తాగారు, ఏదో లక్కు కొద్దీ ఆమె పేరు లాటరీలో వచ్చి, వాళ్ళకే పెళ్లి జరిగింది. మరో రాణీ వీళ్ళను ఆశీర్వదించి, మోసం చేసినందుకు తగిన శాస్తి చేస్తాను అంటూ పెళ్లి కొడుక్కి వార్ణింగ్ ఇచ్చి మరీ వెళ్లిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: