లైఫ్ స్టైల్: మహిళలకు ఎక్కువగా గుండెపోటు రావడానికి గల కారణాలు ఇవే..?

Divya
ఈ రోజుల్లో అనేకమంది మహిళలు ఉద్యోగులుగా, గృహిణులు గా ఎక్కువ పని చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా ఒత్తిడి పెరగడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి అని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. ఇలా తరచూ ఒత్తిడికి గురి కావడం వల్ల మహిళలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు కొంతమంది నిపుణులు.
ఇలా పనికి ఒత్తిడికి గురి కావడం వల్ల రక్తపోటు సమస్య, అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండె జబ్బులు వస్తాయని అనుకున్నారు అందరూ. కానీ కేవలం  పని ఒత్తిడి వల్లే ఎక్కువగా గుండెజబ్బులు వస్తున్నట్లు..ఇప్పుడు ఒక అధ్యయనంలో తేలింది. ఇక మహిళల కంటే పురుషులకే ఎక్కువ గుండెపోటు వస్తుందని.. చాలా మంది అనుకుంటూ ఉంటారు.
కానీ తాజా అధ్యయనంలో మహిళల కంటే , పొగ తాగేవారు, ఊబకాయంతో బాధపడే పురుషులలో ఎక్కువగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉన్నదట. ఇక ముఖ్యంగా అలసట,ఒత్తిడి.. వంటివి పురుషులలో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో పరిశోధకులు వెల్లడించారు.

2007, 2012, 2017 సంవత్సరంలో సర్వే చేయగా 22,000 మంది పురుషులను, మహిళలను  పోల్చి చూడగా , ముఖ్యంగా సాంప్రదాయేతర హానికారకాలు వల్ల ఆందోళన చెందినవారు,  అత్యధికంగా గుండె జబ్బులకు గురి అవుతున్నారని తేలింది . ఇక 2007వ సంవత్సరంలో ఫుల్ డే పనిచేసే మహిళల సంఖ్య సుమారు 38 శాతం ఉండగా , 2017 సంవత్సరం వచ్చేసరికి ఇది కాస్త 44 శాతానికి పెరిగింది.. ముఖ్యంగా మహిళలు లోనే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా  ఉందట.
ఇక మహిళలు , పురుషులు ఇద్దరి తో సమానంగా చూసుకుంటే 2012వ సంవత్సరంలో పనిఒత్తిడి 50 శాతం ఉండగా , అది 2017 వ సంవత్సరం వచ్చేసరికి 26 శాతానికి పెరిగిందట. సరిగ్గా  నిద్ర పోక మహిళల్లో ఎనిమిది శాతం ఎక్కువ మంది గుండె జబ్బులకు గురి అవుతుంటే , ఇక పురుషుల్లో మొత్తం ఐదు శాతం మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే తెలిపింది.. ఈ నివేదిక ప్రకారం చూసుకుంటే పురుషుల కంటే మహిళలే ఒత్తిడికి గురి అవుతున్నారని, ఆ కారణం చేత గుండె జబ్బులు అధికంగా వస్తున్నాయట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: