లైఫ్ స్టైల్ : వంటలో నూనె ఎక్కువ అయితే ఇలా చేయండి..?

Divya

చాలామంది వంటలలో నూనె ఎక్కువగా వేసుకోవడానికి ఇష్టపడరు.. ఎందుకంటే నూనెలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది.. కాబట్టి ఎప్పుడైతే నూనె ఎక్కువగా ఉండే వంటలను తినడం వల్ల మనం బరువు పెరగడంతోపాటు ఎసిడిటీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయని చాలామంది నూనెను తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. అలాగే తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.ఇక  ఒక్కోసారి అనుకోకుండా కూరలలో అప్పుడప్పుడు కొంచెం నూనె ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ట్రిక్  తో మీ ముందుకు వచ్చాము..ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు. కూర లో ఎంత నూనె వున్నా సరే ఇట్టే తీసేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మనం కూడా తెలుసుకుందాం పదండి..
ఒక్కోసారి వంటలలో అనుకున్న దాని కంటే కొద్దిగా నూనె ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. ఒకవేళ కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు కొంచెం నీరు పోసి లేక ఆలుగడ్డ ముక్కలు వేసి కవర్ చేస్తూ ఉంటాము.మరి కారం ఎక్కువైతే కొద్దిగా నిమ్మ రసం వేసి కూరకి రుచిని తెప్పిస్తూ ఉంటాము.. ఇక కూరలో నూనె ఎక్కువైతే..? అప్పుడు ఏం చేయాలి..? మీరు కూడా ఎప్పుడైనా ఆలోచించారా..? మీరు కూడా ఒకవేళ వంటలలో నూనె ఎక్కువ వేసి, ఇబ్బంది పడి ఉండి ఉన్నట్లయితే, ఇప్పుడు చూప బోయే ఒక వీడియోని చూసి మీరు నేర్చుకోండ
ఈ వీడియోలో ఒక వ్యక్తి వంట చేస్తూ.. కూరలో కాస్త చేయి జారి నూనె ఎక్కువైంది. ఈ వ్యక్తి ఏమో చాలా తెలివిగా ఒక ఐస్ ముక్కను తీసుకొని, కూరలో ఒకపక్క పెట్టడం మనం గమనించవచ్చు. బంతి ఆకారంలో ఉన్న ఈ ఐస్ ముక్కలను కూర అంచున పెట్టగానే కూర లో ఉన్న నూనె మొత్తం ఐస్ కు పొరలాగ అతుక్కుంది. ఇక ఆ ఐస్ ముక్కను బయటకు తీసి, దానికి వూన నూనె పొరను స్పూన్ తో తీస్తున్నాడు.ఇక ఒకసారి మీరు కూడా నూనెను చేయి జారినిచ్చినట్లయితే, వెంటనే ఈ ఐస్ ట్రిక్ ఉపయోగించి తీసేయవచ్చు. ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసిన ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: