స్పేస్ జ‌ర్నీ : నింగి నుంచి వినిపిస్తున్న సందేశం

RATNA KISHORE
స్పేస్ జ‌ర్నీ : నింగి నుంచి వినిపిస్తున్న సందేశం
పాల‌పుంత‌లో నేనొక చిన్న భాగాన్ని
ఈ అణువుల్లో అణువుని
ఇక్క‌డి నుంచి చూడండి
నాదేశం ఎంత బాగుందో
అంటూ పొంగిపోయారు క‌ల్ప‌నా చావ్లా 


ఇన్ని ప్ర‌యాణాలు .. దేశానికో కొత్త  ప్ర‌పంచానికో కొత్త.. మ‌న‌దే అన్న భావ‌న నేల నింగీ ఒక్క‌టి చేయొచ్చు.. కానీ నిజంగా మ‌న‌ది అన్న‌ది ఎందాక? డ‌బ్బుంటే చేసే విన్యాసాలు  నెత్తి నేల అయిన అంత‌రీక్షాన్ని ఆక్ర‌మిస్తాయా? ఏమో! కానీ మ‌న రియ‌ల్ట‌ర్ల‌కు అక్క‌డ కూడా ప‌ని ఉంటుందేమో! ఇవ‌న్నీ ఎలా ఉన్నా మ‌న ద‌గ్గ‌ర ఇంకొంత ప‌రిజ్ఞానం ఉంటే గ్ర‌హాల‌ను వాటి ఆనుపానులనూ సులువుగా క‌నుగొనేందుకు ఛాయిస్ ఉంటుందేమో! ఇవ‌న్నీ గ్లామ‌ర్ తో కూడుకున్న‌వి క‌నుక‌నే ఇంత‌టి అటెన్ష‌న్ అంటారు ఓ ఇస్రో శాస్త్ర‌వేత్త..ఇవేవీ కాకుండా వీటికి మించిన ప్ర‌యోగాలో ప్ర‌యాణాలో ఉన్నాయి కానీ అవి మీడియా ప‌ట్టించుకోదు అన్న‌ది కూడా ఆయ‌న భావ‌నే..నిజ‌మే మీడియా మాట్లాడితేనే ఈ స్పేస్ ఫ్లైట్ లు గ‌గ‌న‌పు వీధుల్లోకి తీసుకుపోతాయి మ‌న‌ల్ని... న‌వ్వుకోవాలి మ‌నం..  అన్నింటా పోటీ ఉన్న విధంగానే ఈ స్పేస్ టూరిజంలోనే మ‌రిన్ని పోటీలు వ‌స్తాయేమో!


న్యూ షెప‌ర్డ్ అనే వ్యోమ నౌక జెఫ్ బెజోస్ ను అంత‌రీక్షం దాకా తీసుకువెళ్లింది.. అంత‌కుమునుపు బండ్ల శిరీష  వ‌ర్జిన్ గెలాక్టిక్ అనే స్పేస్ ఫ్లైట్ లో వెళ్లి వ‌చ్చారు.. ప‌ది నిమిషాల పాటు అమెజాన్ కంపెనీ అధినేత అంత‌రీక్షంలో తిరిగి ఎన‌లేని అనుభూతి పొందారు. అలానే ఇలాంటి క‌ల సామాన్యుల‌కూ ఉంటుంది. అంగార‌కుడి అందాల్లోనో చంద్రుడి అందాల్లోనో  తామూ  విహ‌రించాల‌ని ఇవి నెర‌వేరాలంటే మ‌రికొంత సాంకేతిక‌త అందుబాటులోకి రావాలి..

మ‌నిషి ఎదుగుద‌ల నేల నుంచి నింగి వ‌ర‌కూ.. మ‌నిషి ఊహ నేల నుంచి నింగి వ‌ర‌కూ.. ఆకాశం ఏనాటిదో తెలియ‌దు.. ఈ భూమి పుట్టుక ఎప్ప‌టిదీ తెలియ‌దు.. ఇంతటి విశ్వంలో నేనొక రేణువు అని అంటోంది క‌ల్ప‌నా చావ్లా ఓ చోట.. స్పేస్ జ‌ర్నీ అన్న‌ది కోట్ల‌కు సంబంధించిన వ్యాపారంగా మార‌క‌ముందే ఇంకొన్ని క‌ల‌లు నెర‌వేరాలి..కేవలం ఇది ఇప్ప‌టి కుభేరుల సంగ‌తి క‌నుక సామాన్యు ల‌కు ఇలాంటివి అంద‌వు.. అమెజాన్ ఫౌండ‌ర్ కో.. ఏ బిల్ గేట్స్ లాంటి వారికో ఈ అవ‌కాశం అందుతోంది. ఇంకొద్ది రోజుల‌యితే స్పేస్ టూర్ కూడా మ‌రింత అందుబాటులోకి వ‌స్తుందా అన్న‌ది కొంద‌రి ఆశ.

 
అవ‌కాశం ఉంటే ఆకాశం వ‌ర‌కూ.. అవ‌కాశం ఉంటే ఖ‌గోళం చివ‌రి వ‌ర‌కూ .. అంత‌రీక్షం ఊసులు వినేందుకు బాగుంటాయి.. అంత‌రీ క్షం ఊహ‌ల నుంచి వాస్త‌వాల వ‌ర‌కూ చేరువ అయ్యేందుకు చేసే కృషే అత్యంత కీలకం.. నేల మీద ఎడారి నెత్తి మీద ఎడారి ఆ ఎడారిలో ప్రయాణం.. ప్ర‌యాణం మాత్ర‌మే కాదు ఓ గొప్ప అనుభూతి. స్పేస్ టూరిజం పేరు బాగా వినిపిస్తున్న త‌రుణాన తెలుగు అమ్మాయి బండ్ల శిరీష టూర్ స‌క్సెస్ కావ‌డంతో ఇంకొంద‌రు అటుగా వెళ్తున్నారు.. చంద‌మామ ను ద‌గ్గ‌ర గా చూసొద్దామ‌నో లేదా మ‌రికొన్ని అంతరీక్ష అందాల‌ను వీక్షిద్దాం అనో అన్న‌ది వారి తాప‌త్రయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: