లైఫ్ స్టైల్: సుఖంగా నిద్ర పట్టాలంటే ఇలా చేయండి..

Divya
పని ఒత్తిడి, ఆలోచనలు, నిద్రపోవడానికి కూడా సమయం లేనంత, ఏదో పనులు చేస్తూ, చాలామంది నిద్రను కూడా తగ్గించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరిగ్గా నిద్ర పట్టక, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని రావడమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే డాక్టర్లు సగటు మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోజుకు తప్పకుండా 8 గంటల నిద్ర అవసరమని చెబుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మంచి ఆహారం తీసుకున్న కొంతమందికి సరిగా నిద్ర పట్టడం లేదని చెబుతున్నారు. అయితే సుఖంగా నిద్ర పట్టాలంటే ఇప్పుడు చెప్పబోయే చిట్కా పాటించి చూడండి. తప్పకుండా ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.

1. రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగాలి.ఇలా తాగడం వల్ల పాలలో ఉండే ట్రిప్టోపోన్ మీకు సరైన నిద్ర పట్టడానికి కారణం అవుతుంది. ఫలితంగా మీకు ప్రశాంతమైన నిద్ర వస్తుంది. ఇక పాలలో ఉన్న కాల్షియం ఒత్తిడిని తగ్గిస్తే, మెదడులో ఉన్న నరాలకు విశ్రాంతిని కలిగిస్తుంది.
2. ఇక రాత్రి పడుకునే ముందు అరటి పండ్లను కూడా తప్పకుండా తినాల్సిందే. నిద్రకు సహాయపడే విటమిన్ బి , ట్రిప్టోఫోన్ తో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి సమ్మేళనాలు పుష్కలంగా ఉండటం వల్ల ,మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం, మంచి నిద్ర కూడా పడుతుంది.
3. వాల్ నట్స్ లో మెలటోనిన్ అధికంగా ఉండడం వల్ల మనకు సుఖంగా నిద్ర పడుతుంది. కాబట్టి వీటిని పడుకునే ముందు తింటే చాలా ప్రశాంతమైన నిద్ర మన సొంతమవుతుంది. అంతే కాదు రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య కూడా పెరుగుతుంది.
4. అలాగే బాదం గింజలు , గుమ్మడి గింజలు వంటివి కూడా రాత్రి పడుకునే ముందు తప్పకుండా తింటే క్వాలిటీ నిద్ర మీ సొంతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: