లైఫ్ స్టైల్: బియ్యంలో పురుగులు పడకుండా ఉండాలంటే ఇలా చేస్తే సరి..

Divya

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం స్టాక్ ఉండనే ఉంటాయి. అలా ఎందుకు ఉంచుతారు అంటే, బియ్యం ఎక్కువ రోజులు ఉండడం వల్ల బాగా అన్నం ఉడుకుతుందనీ ఒక నమ్మకం. అయితే అలా ఉంచిన బియ్యాన్ని నల్లని చిన్న పురుగులు పడుతూ ఉంటాయి. అయితే ఈ చిట్కాలు పాటించడం వల్ల ఆ పురుగుల బెడద నుంచి తప్పించుకోవచ్చు.
1). వేపాకులను బియ్యం ఆడించిన తర్వాత అందులోకి కలిపితే ఆ బియ్యానికి  పురుగు పట్టే అవకాశం ఉండదు. ఇందులో క్రిమిసంహారక లక్షణం వల్ల ఆ పురుగులు చనిపోతాయి.
ఇక అంతే కాకుండా వేపాకును బాగా ఎండబెట్టి, వాటిని పొడిగా చేసి , ఏదైనా చిన్న క్లాత్ లో పొడిని పోసి కట్టి, బియ్యపు సంచులు మధ్య ఉంచినా, ఆ పురుగులు  పుట్టే అవకాశం ఉండదు.
2). ఇక మరొకటి కర్పూరం. ఇందులో ఘాటైన సువాసన ఉండడంవల్ల. ఈ వాసనకి బియ్యంలో పురుగులు పడవు. వీటిని అలాగైనా బియ్యం సంచుల మధ్య ఉంచవచ్చు/బాగా పొడి చేసి ఒక లైలా ఒక క్లాత్ లో ఆ పొడిని వేసి బియ్యం బాక్స్ లో ఉంచవచ్చు.
3). వెల్లుల్లి రెబ్బలు కూడా బియ్యం సంచుల లోపల పొట్టు తీయకుండా అలాగే ఉంచడం వల్ల అందులోకి పురుగులు రావు.
4). ఇక  లవంగాలను లేదా లవంగాల పొడిని బియ్యపు సంచుల లోపల మూటకట్టి వేయడం వల్ల పురుగుల బారి నుంచి తప్పించుకోవచ్చు.
5). ఇక కాకరకాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి, ఆ ముక్కలను ఎండబెట్టి బియ్యపు సంచులు మధ్య ఉంచడం వల్ల, ఎటువంటి పురుగులు దరిచేరవు.

6). డిసికాన్ ప్యాకెట్ల ను  బియ్యం సంచుల మధ్య ఉంచడం వల్ల బియ్యం లోపల ఉండేటువంటి తేమను ఇవి పీల్చి వేస్తాయి. తద్వారా పురుగులు పట్టకుండా ఉంటాయి. చూశారు కదా ..! మీ ఇంటిలో ఉన్న బియ్యం లో ఎలాంటి పురుగులు గనుక వచ్చినట్లయితే, ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: