ఆడవాళ్ళ జడ వెనుక ఇన్నీ రహస్యాలు ఉన్నాయా....?

Suma Kallamadi
మన సంస్కృతి, సంప్రదాయాల వెనుక మనకి తెలియని రహస్యాలు, కారణాలు చాలానే ఉన్నాయి.కానీ మనమే ఆ ఆచారాలు పాటించకుండా తోసిపారేస్తూ ఉంటాము. కానీ ప్రతి సంప్రదాయం వెనుక ఎదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. కానీ ఈ ఆధునిక కాలంలో ఆ కారణంతో మనకి పని లేదు. మనకి నచ్చినట్లు మనం ఉంటున్నాము. అసలు ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా. ! ఈరోజు మన సంప్రదాయంలో భాగం అయిన ఆడవాళ్ళ జడ గురించిన కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.. ఎప్పుడంటే అందరూ ఫ్యాషన్ అనే పేరుతో జుట్టుని వదిలేసి తమకి నచ్చిన కటింగ్ చూపించుకుని జుట్టు విరబోసుకుని మరి తిరుగుతున్నారు.కొంతమంది స్త్రీలు మాత్రం ఎంచక్కా  జడ వేసుకుని సంప్రదాయాలను పాటిస్తున్నారు. అయితే మీలో చాలామందికి అసలు ఆడవాళ్ళ జడ వెనుక దాగి ఉన్న కొన్ని విషయాలు తెలిసి ఉండకపోవచ్చు.
అసలు జడ వేసుకునే అప్పుడే మూడు పాయలతోనే ఎందుకు అల్లుతారు అనే విషయం కూడా తెలియదు.ఒకప్పుడు మహిళలు వయసుతో సంబంధం లేకుండా చక్కగా జడ వేసుకునేవారు. ఈ జడను కూడా మూడు రకాలుగా  వేసుకునేవారు తెలుసా.ఎవరన్నా అమ్మాయి రెండు జడలు వేసుకుందంటే ఆమె ఇంకా చిన్నపిల్లా అని, పెళ్లికాలేదని అర్ధం అన్నమాట.  అలాగే ఎవరన్నా ఒక జడ వేసుకుంటే ఆమె పెళ్లి అయ్యి, భర్తతో ఉన్న మహిళ అని అర్ధం అన్నమాట.
అలాగే జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుంది అంటే ఆమెకు సంతానం కూడా ఉందని, కుటుంభం బాధ్యతలను మోస్తూ ఉందని అర్ధం అంట. అయితే ఎన్ని రకాల జడలు వేసిన గాని మూడు పాయలు తీసి అల్లడం మాత్రం కామన్ ఉంది గమనించారా.. ఎందుకంటే  ఆ మూడు పాయలకు అర్ధం ఏంటంటే తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం అంట. అలాగే జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అఅనే అర్ధములు కూడా వస్తాయట.ఈ విధంగా అమ్మాయిలు వేసుకునే జడను బట్టి ఆ మహిళ పెళ్లి అయినదా.. లేదా..సంతానం కలిగారా లేదా అనే విషయం తెలిసిపోయేదట . మనం వేసుకునే జడకు ఇంత చరిత్ర ఉందన్నమాట.. నిజంగా మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవి అని చెప్పడానికి ఇంతకన్నా రుజువు ఏమి కావాలి చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: