బరువు తగ్గాలంటే ఈ అలవాట్లు మానుకోవాల్సిందే?

Purushottham Vinay
ప్రస్తుతం చాలా మంది కూడా శరీర బరువు కారణంగా చాలా అందహీనంగా కనిపిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య తగ్గాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొన్ని అలవాట్లు మానుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చు.సరైన నిద్ర లేకపోవడం వల్ల  శరీర బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు పెరిగే కారణాలు నిద్ర లేకపోవడం కూడా ఒక కారణమని కూడా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక తగ్గాలనుకునేవారు ప్రతిరోజు కూడా ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్ర పోవాల్సి ఉంటుంది.ఇంకా అలాగే కొంతమంది తరచుగా తీపి వస్తువులను తింటూ ఉంటారు. అయితే దీని వల్ల కూడా శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో పెరిగి, చాలా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల  రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


అందువల్ల మీరు బరువు తగ్గే క్రమంలో ఖచ్చితంగా వీటిని అతిగా తినకపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.ఇంకా అలాగే చాలామంది కూడా టిఫిన్, లంచ్, డిన్నర్ చేసిన తర్వాత నడవకుండా ఇంట్లోనే అలానే కూర్చుండి పోతారు. అయితే ఇలా చేయడం వల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు పరిశోధించి చెబుతున్నారు. దీని వల్ల చాలామందిలో పొట్ట పెరగడం ఇంకా అలాగే కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా వస్తున్నాయి.ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ ని విచ్చలవిడిగా తింటున్నారు. దీని వల్ల చాలామంది చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడి బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అయితే కొలెస్ట్రాలను కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. లేదంటే ప్రాణాంతకమైన గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆయిల్ ఫుడ్ ను ప్రతిరోజు తీసుకోవడం మానుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: