ఆరోగ్యం: ఈ ఆకులు చేసే మేలు అన్నీ ఇన్నీ కావు?

Purushottham Vinay
చాలా మంది కూడా కడుపు నొప్పి, అజీర్తి, మలబద్దకం, గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలతో చాలా ఎక్కువగా బాధ పడుతూ ఉంటారు. మందులు వాడినా కూడా శాశ్వతంగా ఈ సమస్యలు నుంచి కోలుకోలేరు. అలా ఈ సమస్యలతో ఎక్కువగా బాధపడే వారికి ఉసిరి ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ ఆకుల జ్యూస్ ఈ సమస్యలను తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకుల జ్యూస్ ను 10 ఎమ్ ఎల్ తీసుకొని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందవచ్చు. ఉసిరి ఆకుల జ్యూస్ ను రోజూ కొద్దిగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది.ఇంకా అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల బీపీ ఇంకా షుగర్ వంటి వ్యాధులు కంట్రోల్ లో ఉంటాయి. అలాగే నోటిపూత, నోటిలో అల్సర్ వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకుల కషాయంలో కొద్దిగా ఉప్పుని కలిపి నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల నోటిపూత అలాగే నోటిలో అల్సర్ వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే ఈ కషాయాన్ని గొంతులో పోసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. ఈ ఉసిరి ఆకుల కషాయంతో గాయాలను ఇంకా పుండ్లను కడుగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల గాయాలు చాలా త్వరగా మానుతాయి.ఇంకా అలాగే చర్మ సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులను కాల్చి బూడిద చేసి ఈ బూడిదలో కొద్దిగా ఆవనూనెను కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ ను చర్మ సమస్యలపై లేపనంగా రాయడం వల్ల ఖచ్చితంగా చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు.


అలాగే ముఖంపై మొటిమలు, మచ్చలు వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులను బాగా మెత్తగా నూరి అందులో ఒక టీ స్పూన్ తేనెను కలిపి ముఖంపై ప్యాక్ లా వేసుకోవడం వల్ల చాలా ఈజీగా మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు తగ్గి ముఖం చాలా అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకులతో చేసిన కషాయాన్ని తాగితే కాలేయంలో పేరుకుపోయిన మలినాలు, విష వ్యర్థ పదార్థాలు ఈజీగా తొలగిపోతాయి. కాలేయ ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఉసిరి ఆకుల రసాన్ని పరగడుపున తాగడం వల్ల కామెర్ల వ్యాధి కూడా ఈజీగా తగ్గు ముఖం పడుతుంది. కళ్లు ఎర్రగా మారడం, కళ్ల మంటలు ఇంకా అలాగే కళ్ల నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు ఉసిరి ఆకుల కషాయంతో కళ్లను కడుక్కోవడం వల్ల వివిధ రకాల కంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే 10 గ్రాముల ఉసిరి ఆకులను తీసుకుని అందులో ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని చప్పరిస్తూ ఉండటం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: