ఈ ఒక్క కాయగూర తింటే ఏ జబ్బు రాదు?

Purushottham Vinay
ఈ రోజుల్లో గుండె సమస్యలు, మధుమేహం, క్యాన్సర్ వంటి జబ్బులు బాగా ఎక్కువవుతున్నాయి. అవి రాకుండా ఉండటానికి ఖచ్చితంగా ఆహారం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ముల్లంగి చాలా బాగా పని చేస్తుంది. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో పాటు బద్ధకాన్ని కూడా ఈజీగా దూరం చేస్తుంది. ముల్లంగి తినడం వల్ల క్యాన్సర్ వ్యాధిని ఈజీగా దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ శీతాకాలంలో ముల్లంగి సమృద్ధిగా లభించే ఒక  కూరగాయ. ముల్లంగిని కూరగా వండుకోవచ్చు, సలాడ్, చట్నీ, ఊరగాయ, కోఫ్తా, జ్యూస్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మీరు అనేక రూపాల్లో ముల్లంగిని ఆహారంగా తీసుకోవచ్చు. రోగనిరోధక శక్తిని మెరుగుపరచ్చే విటమిన్లు దీనిలో ఉన్నాయి.అలాగే ఇది శరీరం నుంచి విషపదార్థాలను తొలగిస్తుంది. అయితే ఈ ముల్లంగిని మాత్రం దాని ఆకులతో పాటుగా వండుకోవాలి. ఎందుకంటే ఈ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, భాస్వరం, కాల్షియం వంటి పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకా కేలరీలు తక్కువగా ఉంటాయి. 


అందుకే బరువు కూడా ఈజీగా నియంత్రణలో ఉంటుంది. అలాగే ముల్లంగి  జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది.ముల్లంగిలోని శక్తివంతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను ఈజీగా నియంత్రిస్తాయి. అడిపోనెక్టిన్  రక్తంలో గ్లూకోజ్ స్థాయిల హెచ్చుతగ్గులకు కారకమయ్యే హార్మోన్.ముల్లంగిలో అడిపోనెక్టిన్‌ను నియంత్రించే బయోయాక్టివ్ పోషకాలు ఉంటాయి. అవి గ్లూకోజ్ హోమియోస్టాసిస్‌ను నియంత్రించడంలో చాలా బాగా పని చేస్తాయి.అలాగే ముల్లంగిలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో , గుండె సక్రమంగా పని చేయడంలో పనికొస్తుంది. ఇంకా అలాగే ఈ ముల్లంగిలో ఉండే ఆంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు రక్త ప్రసరణను బాగా మెరుగుపర్చి, రక్తపోటు సమస్యను ఈజీగా తగ్గించడంలో సహాయపడతాయి.ఈ ఒక్క కాయగూర తింటే ఏ జబ్బు రాదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: