చలికాలం: పిల్లల ఆరోగ్యం కోసం జాగ్రత్తలు?

Purushottham Vinay
చలికాలంలో ఖచ్చితంగా అనేక రోగాలు వస్తాయి.ముఖ్యంగా ఈ కాలంలో పిల్లల ఆరోగ్యం పట్ల తల్లి దండ్రులు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో చిన్న పిల్లలు ఎక్కువగా జలుబు, దగ్గు, న్యుమోనియా, ఆస్తమా, శ్వాస సమస్యలు, జ్వరం, చెవి ఇన్ఫెక్షన్లు, కడుపు నొప్పులతో సహా అనేక వ్యాధులకు గురవుతారు.ఒక్కోసారి ఇవి ప్రాణాలకు ప్రమాదకరం కూడా కావచ్చు.అందుకే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు పాటించి వారిని ఆనారోగ్యం బారిన పడకుండా తల్లి దండ్రులు చూసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.చలికాలంలో కూడా చల్లటి నీటినే తాగే వారుంటారు. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే చల్లని నీరు తాగడం వల్ల ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. దీని వల్ల దగ్గు ఇంకా అలాగే జలుబు వచ్చే అవకాశం ఉంది. అందుకోసం పిల్లలకు వేడినీళ్లు ఇవ్వడం వారి ఆరోగ్యానికి మంచిది.


ఇంకా అలాగే ఈ వేడి నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపుతుంది.చాలా మంది పిల్లలు కూడా ఎక్కువగా ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, బర్గర్స్ వంటి జంక్ ఫుడ్స్ తింటారు. జంక్ ఫుడ్స్ తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అయితే వాటిని తినడం మానేసి పిల్లలకు పౌష్టికాహారం ఇచ్చేలా తల్లిదండ్రులు ఖచ్చితంగా జాగ్రత్తపడాలి.ఖచ్చితంగా ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చడం అలవాటు చేసుకోవాలి. ప్రోటీన్, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలు పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడతాయి.ఇక పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి బయటికి వెళ్తారు. ఆడుకుంటే ఆరోగ్యానికి మంచిదే. మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది. అయితే వారిని సూర్యకాంతిలో ఆడనివ్వండి. ఇంకా రెగ్యులర్ వ్యాయామం అనేది పిల్లల పూర్తి ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ పాటించండి. పిల్లల ఆరోగ్యానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి.చలికాలం పిల్లల కోసం ఈ జాగ్రత్తలు పాటించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: