ఊబకాయంని ఈజీగా తగ్గించే సింపుల్ టిప్స్?

Purushottham Vinay
ప్రస్తుత కాలంలో చాలా మందిని ఎంతగానో వేధిస్తున్న సమస్య ఊబకాయం. అయితే దీనికి ప్రధాన కారణం మన అలవాట్లు. జంక్ ఫుడ్ ఇంకా పని ఒత్తిడి వల్ల చాలా మంది కూడా విపరీతంగా బరువు పెరిగిపోతున్నారు.దీన్ని తగ్గించుకోవడానికి కొంతమంది జిమ్ బాట పడుతుంటే, మరి కొంతమంది మాత్రం డైట్ ఫాలో అవుతున్నారు. అలా కాకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొవ్వును కరిగించడంలోనూ ఇంకా పెరగకుండా చేయడంలోనూ ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు ఈజీగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. పెరుగులో ప్రొటిన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి కొవ్వు కరగడంలో బాగా ఉపయోగపడతాయని చెబుతున్నారు.క్వినోవా ధాన్యంతో చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారని కూడా చెబుతున్నారు. ఇందులో పీచు పదార్థం, విటమిన్ ఈ, ఐరన్ ఇంకా అలాగే జింక్ ఉంటుందని అంటున్నారు.


ఇక దాల్చిన చెక్కలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే శక్తి ఉంది. దీని వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. పుచ్చకాయ ఇంకా కర్బూజా వంటి నీటి శాతం ఎక్కువగా పండ్లను తిసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదట. వీటిలో ఉన్న ఫైబర్ శరీరానికి బాగా అంది.. ఆకలి కూడా తగ్గుతుంది.పచ్చికూరగాయలు, ఆపిల్ ఇంకా అలాగే టమాటొ వంటి పండ్లను సలాడ్గా తినమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా బ్లాక్ టీ తీసుకునే వాళ్లు బరువు తగ్గిన దాఖలాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక టీలో ఒక రకమైన ఫ్లెమనాయిడ్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచి శరీర కొవ్వులను త్వరగా విచ్ఛిన్నం చేయడంలో బాగా సహాయపడతాయి. చాలా ‘టీ’లలో ఉండే కెఫిన్.. శక్తి వినియోగాన్ని బాగా పెంచుతుంది. దీని వల్ల శరీరం కేలరీలను ఈజీగా కరిగిస్తుంది. ఇంకా అలాగే గ్రీన్ టీని వల్ల కూడా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: