కొవ్వుని కరిగించే నూనె.. ఇలా తయారు చేసి వాడండి?

Purushottham Vinay
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందు కోసం ముందుగా ఒక గిన్నెలో 50 ఎమ్ ఎల్ ఆవ నూనెను తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో 20 మిల్లీ గ్రాముల కొబ్బరి నూనెను వేసి బాగా కలపాలి. ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ వామును, రెండు ఇంచుల దాల్చిన చెక్కను ముక్కలుగా చేసి వేయాలి. తరువాత ఇందులో 4 లేదా 5 కర్పూరం బిళ్లలను పొడిగా చేసి వేసుకోవాలి.ఇప్పుడు ఈ నూనెను చిన్న మంటపై ఒక 8 నుండి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి.ఇక ఈ నూనె వేడయ్యేటప్పుడు ఇందులో నుండి నురుగు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. ఇలా వేడి చేసిన తరువాత ఈ నూనెను వడకట్టి వేరొక గిన్నెలోకి తీసుకోవాలి.అయితే ఈ నూనెను ఎలా ఉపయోగించామన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ నూనెను సరిగ్గా వాడకపోతే ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందలేము. ఇలా తయారు చేసుకున్న నూనెను మనం ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు.


ఇప్పుడు ఈ నూనెను తగిన మోతాదులో తీసుకొని వేరే గిన్నెలో తీసుకోవాలి. తరువాత ఈ గిన్నెను నూనె వేడయ్యే దాకా వేడి నీటిలో ఉంచాలి. నూనె వేడయ్యాక ఇందులో ఒక టీ స్పూన్ అల్లం రసాన్ని వేసి బాగా కలపాలి. ఇక చాలా చేయడం వల్ల ప్యాట్ బర్నింగ్ ఆయిల్ తయారవుతుంది.ఇక ఈ నూనెను చేత్తో తీసుకుని శరీరంలో కొవ్వు పేరుకుపోయిన భాగాల్లో చర్మం మీద రాసి ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మర్దనా చేయాలి. ఇక ఆ తరువాత వేడి బయటకు పోకుండా నూనె రాసిన భాగాన్ని కాటన్ వస్త్రంతో బాగా చుట్టాలి. దీన్ని ఒక మూడు నుండి నాలుగు గంటల పాటు అలాగే ఉంచాలి.ఆ తరువాత గోరు వెచ్చని నీటితో శరీరాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఈ విధంగా ప్రతిరోజూ వాడటం వల్ల శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి మనం అధిక బరువు సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చు. ఈ నూనెను వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: