లివర్ ని క్లీన్ చేసే డ్రింక్? ఖచ్చితంగా తాగండి!

Purushottham Vinay
కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాలేయంలోని మలినాలను ఈజీగా తొలగించి కాలేయాన్ని శుభ్రంగా ఇంకా అలాగే ఆరోగ్యంగా ఉంచే ఒక డిటాక్స్ డ్రింక్ ను మన ఇంట్లో సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ఇక ఈ డ్రింక్ తీసుకున్న 24 గంటల్లోనే కాలేయంలోని మలినాలు అన్ని కూడా చాలా ఈజీగా తొలగిపోవడం జరుగుతుంది.సొరకాయ ముక్కలను, కొత్తిమీరను, పసుపును,నిమ్మరసాన్ని ఇంకా బ్లాక్ సాల్ట్ ను తీసుకోవాలి. ముందుగా ఒక జార్ లో సొరకాయ ముక్కలను, గుప్పెడు కొత్తిమీరను ఇంకా అలాగే కొద్దిగా నీటిని పోసి జ్యూస్ లాగా చేసుకోవాలి.తరువాత ఈ జ్యూస్ ను ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో పావు టీ స్పూన్ పసుపును వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తరువాత అందులో అర చెక్క నిమ్మరసాన్ని వేసుకొని రుచికి తగినంత బ్లాక్ సాల్ట్ ను వేసి బాగా కలపాలి. అయితే ఈ బ్లాక్ సాల్ట్ అందుబాటులో లేని వారు ఇందులో రాళ్ల ఉప్పును కూడా వేసుకోని కలుపుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కాలేయంని శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్ తయారవుతుంది.


ఈ డ్రింక్ ని మీరు ఉదయం పూట అల్పాహారం చేసిన అర గంట తరువాత తాగాలి.ఇంకా అలాగే ఈ పానీయాన్ని తీసుకున్న తరువాత గంట దాకా ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు ఇంకా తాగకూడదు. ఇలా క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు చేయడం వల్ల కాలేయంలోని వ్యర్థాలు అన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోయి కాలేయం బాగా శుభ్రపడుతుంది. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల జీర్ణాశయం కూడా చాలా బాగా శుభ్రపడుతుంది. శరీరంలోని మలినాలన్నీ కూడా చాలా ఈజీగా తొలగిపోతాయి. ఈ టిప్ పాటిస్తూనే తాజా కూరగాయలను ఇంకా అలాగే పండ్లను ఆహారంగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇంకా అలాగే నీటిని ఎక్కువగా తాగాలి. ఈ టిప్ పాటించడం వల్ల కాలేయం శుభ్రపడడంతో పాటు మన ఆరోగ్యం కూడా చాలా బాగా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: