రక్త హీనత సమస్య : ఈ పానీయంతో పరార్?

Purushottham Vinay
ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీటిని తీసుకుని వాటిని వేడి చేయాలి. తరువాత ఆ నీళ్లు వేడయ్యాక ఈ నీటిలో 10 నుండి 20 ఎండు ద్రాక్షలను వేయాలి. తరువాత ఈ నీళ్ళని 5 నుండి 7 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఈ నీళ్ళని మరిగించి దానిపై మూతను ఉంచి రాత్రంతా కూడా అలాగే ఉంచాలి. ఉదయాన్నే నిద్రలేచాక బ్రష్ చేసి పరగడుపున ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. అలాగే ఈ ఎండు ద్రాక్షను ఉదయం పూట అల్పాహారంతో తీసుకోవాలి. రక్తహీనత సమస్యతో బాగా బాధపడే వారు ఇలా నీళ్లల్లో మరిగించిన ద్రాక్షను తీసుకోవడం వల్ల వారికి ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఎండు ద్రాక్షను నీళ్లల్లోనే కాకుండా పాలల్లో వేసి మరిగించి తాగొచ్చు.ఈ ఎండుద్రాక్షతో చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల ఇంకా చాలా రకాల ప్రయోజనాలు వున్నాయి. దీన్ని తాగడం వల్ల మలబద్దకం, గ్యాస్, ఎసిడిటివంటి సమస్యలు కూడా తగ్గుతాయి.


అలాగే ఉదయం పూట ఈ పానీయాన్ని తాగడం వల్ల జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. అలాగే ఎండుద్రాక్షతో చేసిన ఈ పానీయాన్ని తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఇంకా అలాగే ఎముకలు ధృడంగా మారి కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి. అలాగే కాలేయంలోని మలినాలు కూడా ఈజీగా తొలగిపోయి కాలేయం శుభ్రపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడే వారు ఇలా ప్రతిరోజూ ఎండు ద్రాక్షతో చేసిన పానీయాన్ని తాగడం వల్ల ఈ సమస్య తగ్గడంతో పాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: