దంతల ఆరోగ్యానికి ఇలా చెయ్యండి?

Purushottham Vinay
చాలా మంది దంతాలు కూడా తెల్లగా ఉండవు. అలాగే దంత సమస్యలతో బాధపడే వారు ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువవుతున్నారు. దంతాల నొప్పులు, దంతాలు పుచ్చిపోవడం, దంతాలు పచ్చగా మారడం ఇంకా అలాగే దంతాలు వదులుగా మారడం వంటి ఎన్నో రకాలుగా దంత సమస్యలతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. దంతాల సమస్యలను తగ్గి దంతాలు ఆరోగ్యంగా, ఇంకా అలాగే తెల్లగా ఉండాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల టూత్ పేస్ట్ లను చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు.ఈ టిప్ పాటించడం వల్ల ఎటువంటి దంత సమస్య అయినా చాలా తగ్గు ముఖం పడుతుంది. దంతాలను ఆరోగ్యంగా, తెల్లగా, అందంగా మార్చే టిప్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ టిప్ ను తయారు చేసుకోవడానికి ముందుగా రెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిని బాగా పేస్ట్ గా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో ఒక అర టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ను లేదా అర టీ స్పూన్ రాళ్ల ఉప్పును వేసి బాగా కలపాలి.


చివరగా ఇందులో ఒక టీ స్పూన్ ఆవ నూనెను లేదా అర టీ స్పూన్ లవంగం నూనెను వేసి బాగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నొప్పి ఉన్న దంతాలపై ఒక 10 నిమిషాల పాటు ఉంచాలి.ఆ తరువాత గోరు వెచ్చని నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించాలి.మీ దంతాలు వదులవడం ఇంకా దంతాలు పచ్చగా మారడం వంటి సమస్యలతో బాధపడే వారు ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను 2 నిమిషాల పాటు బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాల నొప్పులు ఇంకా అలాగే దంతాలపై ఉండే గార తొలిగిపోతుంది. ఈ విధంగా వెల్లుల్లి మిశ్రమంతో దంతాలను బాగా శుభ్రం చేసుకోవడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తాయి. నోటి దుర్వాసన సమస్య కూడా ఈజీగా తగ్గుతుంది. ఈ టిప్ ని పాటించడం వల్ల అన్ని రకాల దంతాల సమస్యల నుండి ఉపశమనం బాగా కలుగుతుంది. దంతాల సమస్యలతో బాధపడే వారు ఈ టిప్ క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. చక్కటి అందమైన ఇంకా అలాగే ఆరోగ్యవంతమైన దంతాలను మన సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: