పరగడుపున ఇది తీసుకుంటే ఏ జబ్బులు రావు?

Purushottham Vinay
మనకు ప్రకృతి ప్రసాదించిన ఆరోగ్యకరమైన వాటిల్లో నిమ్మకాయ కూడా ఒకటి. ఇవి చక్కటి రుచి, వాసన కలిగిన సిట్రస్ జాతికి చెందిన కాయలు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మకాయలను ఉపయోగించడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరంగా ఉండవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా నిమ్మకాయ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అల్లంతో అద్భుతమైన వైద్యం చేయవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అల్లాన్ని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో అల్లం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.అల్లాన్ని కొన్ని వారాల పాటు వాడడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అల్లాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల కడుపులో పూత ఏర్పడకుండా ఉంటుంది. నోటి సంబంధిత సమస్యలను తగ్గించడంలో, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో, నోటి దుర్వాసనను తగ్గించడంలో అల్లం ఎంతో సహాయపడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు అల్లం దివ్యౌషధంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలోని చక్కెరలను కండరాలకు చేరే ప్రక్రియను అల్లం వేగవంతం చేస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నయం చేసుకోవచ్చు. దగ్గు, కఫం వంటి సమస్యలను కూడా మనం అల్లాన్ని ఉపయోగించి తగ్గించుకోవచ్చు.


మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లాన్ని, నిమ్మరసాన్ని వేరువేరుగా తీసుకోవడానికి బదులుగా వాటితో పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అల్లాన్ని కచ్చా పచ్చాగా దంచి వేసి మరిగించాలి.తరువాత ఈ నీటిని వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ నీటిలో నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. ఈ పానీయాన్ని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ నశిస్తాయి. చర్మ సౌందర్యం పెరుగుతుంది. చర్మం మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. అల్లం, నిమ్మరసం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల వికారం సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. దగ్గుతో బాధపడే వారు ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.ఈ పానీయాన్ని తీసుకోవడం వ్లల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. మైగ్రేన్ తలనొప్పి కూడా ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల తగ్గుతుంది. అల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల కలిగే మేలు అంతా ఇంతా కాదని, ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: