ఈ చిట్కాలతో అధిక బరువు ఈజీగా తగ్గొచ్చు?

Purushottham Vinay
నడుము చుట్టూ, తొడల దగ్గర, పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది. ఈ సమస్యతో బాధపడే వారికి అల్లం నీరు ఎంతగానో సహాయపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి అల్లం నీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక గిన్నెలో మూడు గ్లాసుల నీటిని పోసివేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక శుభ్రపరిచి తరిగిన అల్లం ముక్కలను వేసి మరలా మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి ఒక కప్పులోకి తీసుకుని రుచికి తగినంత తేనెను కలిపి తాగాలి. ఈ నీటిని రోజుకు రెండు లేదా మూడు సార్లు తాగడం వల్ల వివిధ భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరగడంతోపాటు బరువు కూడా తగ్గుతారు. ఈ టిప్స్ పాటించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా త్వరగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.అధిక బరువుతో బాధపడే వారు మందార టీ నితాగడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గవచ్చు. మందార పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పువ్వులతో టీ ని తయారు చేసుకుని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


ఈ టీ ని తయారు చేసుకోవడానికి గాను 5 ఎండిన మందార పువ్వులను, రెండు గ్లాసుల నీటిని, తేనెను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా గిన్నెలో నీటిని తీసుకుని వేడి చేయాలి. తరువాత అందులో ఎండిన మందార పువ్వులను వేసి మరో 5 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ టీ ని వడకట్టుకుని ఒక కప్పులోకి తీసుకోవాలి. తరువాత అందులో తగినంత తేనెను కలిపి తీసుకోవాలి. ఈ టీ ని ప్రతిరోజూ రెండు నుండి మూడు సార్లు తాగడం వల్ల శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి త్వరగా బరువు తగ్గుతారు.అలాగే ఒక గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి.తరువాత అందులో పసుపు, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకుని తాగాలి. ఈ డ్రింక్ ను క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజుకుగా తయారవుతారు. అదే విధంగా అధిక బరువుతో బాధపడే వారు మందార టీ నితాగడం వల్ల కూడా త్వరగా బరువు తగ్గవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: