లైఫ్ స్టైల్: ఇంటిలో ఈ వస్తువులను ఇలా చేస్తే మెరిసిపోతాయి..!!

Divya
ప్రస్తుతం రాబోతున్న దసరా పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యంగా భావిస్తూ ఉంటారు. అయితే మొదట మనం శుభ్రం చేసేటటువంటి వాటిలో తలుపు ఇంటి గోడలు ఉంటాయని చెప్పవచ్చు. అయితే ఇంటి తలుపులను శుభ్రం చేయడం చాలా ముఖ్యము ముఖ్యంగా తలుపులను చెక్కతో ఉండడం వల్ల వాటిని జాగ్రత్తగా చూసుకోకపోతే అవి చెదులు బారిన పట్టి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇనుప తలుపులను శుభ్రం చేయకపోతే తుప్పుపట్టే అవకాశం ఉంటుంది అందుచేతనే ఇప్పుడు వీటిని ఎలా శుభ్రపరచుకోవాలో మనం తెలుసుకుందాం.

1). నీటితో ఎక్కువగా తుడచడం వల్ల చెక్క తలుపులు చాలా పాడైపోతాయి అందుచేతనే తలుపులకు నూనె రాసి ఆ తర్వాత వాటిని తుడవడం మంచిది. నూనె రాయడం వల్ల తలుపు జామ్ అవ్వదు తెరిచినప్పుడు కూడా ఎలాంటి శబ్దం లేకుండా చాలా పాలిష్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా తలుపు లోపల ఉబ్బిపోయి చెడులు పట్టవు.

2). అయితే మన ఇంట్లో అమర్చిన ఇనుప తలుపులను కిటికీలను సైతం శుభ్రం చేయడానికి ఇసుక పేపర్ ను ఉపయోగించడం చాలా మంచిది. దీనివల్ల ఆ వాకిలిపై ఉన్న తుప్పులను తొలగిస్తాయి. అయితే ఇనుప తలుపుల నుండి తొలగించడానికి వెనిగర్ స్ప్రే చేసినా కూడా శుభ్రం అవుతాయి

3). నిమ్మ పండు, ఉప్పు సహాయంతో ఇనుప కిటికీలను, తలుపులను శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పు నిమ్మరసాన్ని బాగా పిండి ఇనుప తలుపుల పైన తుప్పు పట్టిన ప్రదేశంలో పట్టించి వాటిని ఏదైనా ప్రస్తుతం శుభ్రం చేసినట్లు అయితే తగిన ఫలితం లభిస్తుంది.

4). ఇక ఇంటి గోడలను శుభ్రం చేయడానికి కాస్త నీటిలోకి షాంపూ వేసి నీటితో శుభ్రం చేయడం వల్ల.. గోడలు చాలా శుభ్రంగా కనిపిస్తాయి.

5). ఇక సామాన్లను సైతం నీటిగా శుభ్రం చేసుకోవాలి అంటే భట్టి ఇటుకల నుంచి వచ్చిన పొడితో శుభ్రం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: