లైఫ్ స్టైల్: ఈ మొక్కలు పెంచితే.. ఆరోగ్యం మీ సొంతం..!

Divya
ప్రకృతి మనకు ప్రసాదించిన ఎన్నో మొక్కలు మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతి మనకు ఎంతో ఇచ్చింది.. కానీ కృత్రిమ పద్ధతులకు అలవాటు పడటం వల్ల తిరిగి ప్రకృతి సహజ సిద్ధ జీవన విధానాన్ని అలవాటు చేసుకోలేకపోతున్నాము. ఇకపోతే ఫలితంగా మనుషులు అనారోగ్యవారిన పడుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా అనారోగ్య సమస్యల బారిన పడుతూ విపరీతంగా చికిత్స కోసం ఎదురుచూస్తున్నారు. ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా ఫలితం లేకపోవడం వల్లే మళ్లీ ఆయుర్వేద వైద్యం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక అలాంటి అత్యుత్తమ విలువలు కలిగిన మూలికా మొక్కలను మీరు ఇంటి పరిసరాల్లో పెంచుకున్నట్లయితే ఆరోగ్యం ఇక మన చెంతే.
అలాంటి వాటిలో ముఖ్యంగా వట్టివేరు కూడా ఒకటి.. వట్టివేరు ఉపయోగాలు తెలిస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఇక వట్టివేరు నుండి తీసిన నూనెతో శరీరంపై మర్దన చేస్తే ఒంటినొప్పులు దూరం అవుతాయి. ఇక దీని నుండి తీసిన నూనె సంతాన సాఫల్యతకు, చర్మవ్యాధులకు,  కీళ్ల నొప్పుల నివారణకు,  పుండ్ల నివారణకు , మొటిమలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. వైద్య వృత్తిలో అరోమాథెరపీ చేయడానికి వట్టివేరును ఉపయోగిస్తారు
 అంతే కాదు పరిమళ ద్రవ్యాలలో,  సబ్బులు , లోషన్స్ వంటి సౌందర్య సాధనలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు.వట్టివేరు యొక్క ఆకులు, వేర్లు, పుష్పాలు , బెరడు అన్నీ కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
అడ్డ రసం చెట్టు:
విలువైన మూలిక మొక్క ఈ అడ్డ రసం చెట్టు. ఇక ఈ మొక్కలను మలబార్ నట్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఆయుర్వేదంలో ఔషధాలు తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా శరీరంలోని వాత, పిత్త, కఫ సంబంధమైన సర్వవ్యాధులను తగ్గిస్తాయి. ముఖ్యంగా రక్త పైత్యం , దగ్గు, మేహం, క్షయరోగం, కుష్టు రోగం మొదలైన వాటిని తొలగించుకోవచ్చు. ఇక ఇలాంటి మొక్కలను మీరు మీ పరిసరాల్లో పెంచుకున్నట్లయితే ఆరోగ్యం మీ ఇంట్లో ఉన్నట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: