పిల్లలు రాత్రి ఏడవకుండా ప్రశాంతంగా నిద్రించే టిప్స్?

Purushottham Vinay
మనం రెగ్యులర్ గా గమనిస్తూనే ఉంటాం. కొన్నిసార్లు అయితే పిల్లలు చెవిలో తీవ్రమైన నొప్పికి రాత్రిపూట బాగా ఏడుస్తారు. ఈ చెవి నొప్పి నివారించడానికి కొన్ని రెమెడీస్‌తో ఉపశమనాన్ని పొందవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా చదివి తెలుసుకొని పాటించండి. జాగ్రత్తగా ఉండండి.చాలా సార్లు కూడా పిల్లలు రాత్రిపూట చాలా బిగ్గరగా ఏడవడం మొదలు పెడతారు. మాటలు రాని పనితనం, పైగా ఏ బాధనూ చెప్పలేనితనం వల్ల వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనేది సరిగ్గా తెలీదు తల్లితండ్రులకు. వారి సమస్యకు కారణమేమిటో అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. పిల్లల్లో జలుబు ఉన్నప్పుడు, చెవిలో నొప్పి ఉంటుంది. ఇది కాకుండా, కొన్నిసార్లు తేమ కారణంగా, చెవిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. అలాగే చెవిలో వ్యాక్స్ కూడా నొప్పిని కలిగిస్తుంది. దీనితో రాత్రి చెవిలో తీవ్రమైన నొప్పి ఉంటుంది. చెవి నొప్పి ఏవయసు వారికైనా తీవ్రమైన బాధే..మరి రాత్రిపూట చెవినొప్పితో బాధపడే పిల్లలకు ఉపశమనాన్ని ఏలా ఇవ్వచ్చు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.


పిల్లల చెవిలో నొప్పి ఉన్నప్పుడు, ఐస్ ముక్కతో కాస్త ఉపశమనం కలుగుతుంది. చెవి నొప్పి కారణంగా పిల్లలకు భరించలేని నొప్పి ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ ముక్కను పెట్టండి. ఇది నొప్పిని తగ్గిస్తుంది. కాటన్ క్లాత్‌లో ఐస్ ముక్కను తీసుకొని చెవి వెనుక లేదా నొప్పి ఉన్న ప్రదేశంలో పెట్టాలి. ఇది త్వరగా ఉపశమనం ఇస్తుంది.తులసి రసం అనేది చాలా ప్రభావవంతమైన రెమెడీ. పిల్లలకు చెవిలో నొప్పి వచ్చినప్పుడల్లా తులసి ఆకుల రసాన్ని తీసి 1-2 చుక్కలు చెవిలో వేయండి. ఇది నొప్పిని ఆపివేస్తుంది. పిల్లలు రాత్రిపూట సులభంగా నిద్రపోతారు. చెవినొప్పిలో ఆలివ్ ఆయిల్ కూడా మేలు చేస్తుంది. కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసి, దూదితో చెవిలో 1-2 చుక్కల నూనె వేయండి. ఇలా చేస్తే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.పై విధంగా చేయడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మంచి ఫలితాలు పొందుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: