లైఫ్ స్టైల్: బరువును తగ్గించే అద్భుతమైన ఆహార పదార్థాలు ఇవే..!

Divya
సాధారణంగా ఈ మధ్యకాలంలో చాలామంది తరచూ ఎదుర్కొంటున్న సమస్యలలో కడుపుబ్బరం,  అధిక బరువు అని చెప్పవచ్చు. ముఖ్యంగా అధిక బరువు సమస్యను పక్కన పెడితే కడుపుబ్బరం అనేది తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అంతే కాదు ఎలాంటి పనులపై కూడా మీకు శ్రద్ధ లేకుండా చేస్తుంది.  అజీర్తి,  గ్యాస్ , ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడితే ఆ సమస్యను దూరం చేసే కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతిరోజు వ్యాయామం చేయడం,  సరైన ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం వల్ల ఇటువంటి సమస్యలను చాలా వరకు తగ్గించవచ్చు అని నిపుణులు కూడా సలహా ఇస్తున్నారు.
జీర్ణ సమస్యలు అధికంగా ఉన్నప్పుడు అరటిపండు చాలా బాగా పనిచేస్తుంది. ఓట్ మీ,  అరటిపండు, పాలు, దాల్చిన చెక్క,  తేనె తో ఒక స్మూతీ తయారు చేసుకుని తాగడం వల్ల కడుపు ఉబ్బరం సమస్యలు దూరం అవుతాయి. ముందుగా ఒక పాన్ లో పాలు, దాల్చిన చెక్క, ఓట్స్ వేసి బాగా మీడియం మంట పైన మరిగించాలి. కొన్ని నిమిషాల తర్వాత మిశ్రమం చిక్కబడుతుంది. అందులో అరటి ముక్కలు,  తేనె వేసి బాగా కలిపి తింటే టేస్ట్ తో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
కోడిగుడ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచిని చేకూరుస్తాయి. అయితే పసుపు కలిపినప్పుడు జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అందుకే ఒక బౌల్లో కోడిగుడ్లను పగలగొట్టాలి . అందులో పసుపు వేసి.. ఇప్పుడు  పాన్ వేడి చేసి నూనె వేయాలి
 అందులో ఇప్పుడు కలిపి పెట్టుకున్న పసుపు గుడ్డు మిశ్రమం వేసి ఫ్రై చేసి తింటే కడుపు సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి. అంతేకాదు బొప్పాయిసలాడు , జీలకర్ర నీరు కూడా కడుపు ఉబ్బరం సమస్యలను దూరం చేస్తాయి. ఇటువంటి చిట్కాలు మీరు సమస్య వచ్చినప్పుడు పాటిస్తే త్వరగా తగ్గడమే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: