లైఫ్ స్టైల్ : నరాల బలహీనతకు చెక్ పెట్టే అద్భుతమైన ఔషధం ఇదే..!!

Divya
ఇటీవల కాలంలో సంబంధం లేకుండా చాలా మంది కాళ్ల నొప్పులు అలాగే నరాల బలహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు కాళ్లు, చేతులు వణకడం,  మాట్లాడే క్రమంలో కళ్ళ నుంచి నీరు రావడం .. అనుకోనీ సంఘటన చూసినా,  విన్నా గుండె దడదడా కొట్టుకోవడం, బరువు లేని వస్తువులు కూడా మోయడానికి శక్తి లేకపోవడం,  రాయాలంటే చేతులు వణకడం ఇలా ఎన్నో సమస్యలను చూస్తూ ఉంటాము. నరాల బలహీనత కారణంగా ఏ పని చేయలేక చాలా వేగంగా అలసటకు గురి అవుతారు. ముఖ్యంగా ఆహారం లోపం ఉన్నప్పుడు ఫిజికల్ గా ఎటువంటి పని చేయకపోయినా లేదా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఏర్పడుతుంది.
మంచి పోషకాహారం కలిగిన ఆహారం తీసుకుంటే నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. సాధారణంగా నరాల బలహీనత రాగానే చాలామంది  మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ఇది వాడటం వల్ల శరీరంలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజ సిద్దంగా తయారు చేసిన ఆహార పదార్థాలతో నరాల బలహీనత సమస్యని తరిమికొట్టవచ్చు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 10 గ్రాముల వాల్ నట్స్,  10 గ్రాముల దాల్చిన చెక్క, 10 గ్రాముల మిరియాలు, 10 గ్రాముల అవిసె గింజలు వేసి మెత్తటి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిలువ చేసుకొని ప్రతిరోజు అర టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగాలి.
ఇకపోతే ప్రతిరోజు ఇలా చేయడం వల్ల మీ శరీరానికి కావలసిన ఎనర్జీ లభించడమే కాదు అలసట లేకుండా ఉంటుంది. అంతేకాదు నరాల సమస్య దూరం అయిపోయి.. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇక ఈ పొడి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక ఉదయం లేదా రాత్రి సమయంలో తాగితే సరిపోతుంది. ఇక ఇలా కొద్ది రోజులపాటు తాగితే నరాల బలహీనత సమస్యను తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: