లైఫ్ స్టైల్: చిన్న వయసులోనే తెల్లజుట్టు కనబడుతోందా.. అయితే ఇలా చేసి చూడండి..!

Divya
ఇప్పుడు ఉన్న ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు కనబడుతున్నాయి.ఈ సమస్య చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికి అతి పెద్ద సమస్యగా మారుతోంది.
కొద్దిగా తెల్లని వెంట్రుకలు వచ్చినా.. దానిని సరి చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. హెయిర్ కలర్స్, డై, హెన్నా, గోరింటాకు ఇలా చాలా ఉత్పత్తులను వాడుతుంటారు. సహజ సిద్ధమైన ఉత్పత్తులు వాడితే ఎలాంటి సమస్యా ఉండదు.
 
అసలు తెల్లజుట్టు ఎందుకు వస్తుందంటే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం , హార్మోన్ అసమతుల్యత, ఒత్తిడి వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.కొంతమంది తెల్లని జుట్టు ఒకసారి వస్తే  ఎప్పటికి పోదని,కలర్స్ వేసుకుని కవర్ చేయాల్సిందేనని అనుకుంటారు. కానీ కొన్ని చిట్కాలు పాటిస్తే, ఏ విధమైనా దుష్ప్రభావాలు లేకుండా జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి(Amla):
జుట్టుకు, చర్మ సమస్యలకు సంబంధించి ఆయుర్వేద వైద్యంలో ఉసిరిది ప్రధమ స్థానం. దీనిలో ఉన్న పోషకాలు, విటమిన్ల వల్లే దీనికి అంతటి ప్రాధాన్యత తెచ్చిపెట్టాయి.ఉసిరిలో ఉంటే పోషకాలు రోజూ తీసుకుంటే.. జుట్టు రంగు మారకుండా ఉంటుంది.ఉసిరి కాయల నుండి జ్యూస్ తయారుచేసి,కొబ్బరి నూనెతో కలిపి తలకు మసాజ్ చేయాలి.ఇలా తరచూ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. జ్యూస్ కాకుండా ఉసిరి పొడి కూడా తలకు పట్టించవచ్చు.
ఆవు నెయ్యి:
ఆవు నెయ్యి,కరివేపాకును భోజనంలో చేర్చుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.అంతే కాక రెండు టేబుల్ స్పూన్ ల ఆవు నెయ్యి లో కరివేపాకును నల్లగా మారేవరకు మరిగించి చల్లార్చి గోరువెచ్చగా ఉన్నట్టుగానే తలకు మర్దనచేస్తే క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది
బృంగరాజ్(Bhringraj):
బృంగరాజ్ తో చేసే నూనె వాడటం వల్ల జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ఈ నూనెను కలబందగుజ్జుతో కలిపి తలను మంచిగా మసాజ్ చేస్తే రక్తప్రసరణ పెరిగి జుట్టు రాలదు. మసాజ్ తర్వాత గంట ఆగి  తక్కువ గాఢత ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి . ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చక్కటి నల్లటి జుట్టు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: