ఈ మొక్కలు రైతులకు చాలా డేంజర్‌?

పొలం గట్లు మీద పెరిగే నక్షత్ర గడ్డి  మొక్కలను చూస్తే,  రైతులు హడలిపోతారు. ఈ మొక్క విత్తనాలు సుమారు 3 కి.మీల మేర గాలి లో వ్యాపిస్తాయి. పంట పొలంలో ఈ మొక్క  మొలిచిందంటే, పంటల దిగుబడి తగ్గిపోతుంది. 1973లో ఈ మొక్కను మహారాష్ట్ర, బీహార్ లో కనుగొన్నారు.  ఆహార ధాన్యాలతో పాటు దీని విత్తనాలు మనకు దిగుమతి అయ్యాయి. దీని  పుప్పొడిని పీలిస్తే మనుషులకు జలుబు, కళ్లు ఎర్రబడడం, కను రెప్పలు వాపు వస్తాయి. ప్రమాద కరమైన ఈ మొక్కలు పూతదశకు రాకుండానే నివారించాలి.

ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది? ఆకులు,కాయలు, వేర్లు  ఏ రకంగా ఉపయోగించవచ్చు లాంటి సాధారణ మూలికా జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి వందల సంవత్సరాలుగా అందుతున్నది. మధ్యలో ‘శాస్త్రీయ విప్లవం’  వల్ల ఇప్పటి తరానికి ఈ జ్ఞానం దూరమైంది.  కొన్ని గిరిజన తెగల్లో మూలికలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది.  ఆధునిక వైద్యం అందుబాటులో లేక పోయినా సాధారణ వ్యాధులను అడవుల్లో దొరికే వన మూలికలతోనే నయం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాటి విలువైన ఔషధ గుణాలను విద్యార్ధులకు, ప్రజలకు  చెప్పడం వల్ల ఆరోగ్యంతో పాటు  పర్యావరణం కాపాడుకోవచ్చు.

గిరిజనుల నుంచి ప్రాచీన రుషుల నుంచి పల్లెల నుంచి క్రమంగా మూలికా  వైద్యం విస్తరిస్తూ వచ్చింది. ఔషధాలుగా వాడే చాలా మూలికలు ఆహారంగానూ, మసాలా దినుసులు గానూ, సుగంధ ద్రవ్యాలుగానూ మారి వేలాది సంవత్సరాలుగా వాడుకలో ఉన్నాయి. పసుపు, వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇలాంటివే. సరస్వతి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.  ఈ మొక్క సారాన్ని చైనీయులు వైద్యంలో మెదడుకి టానిక్ గా  ఉపయోగిస్తారు. ఒత్తిడి, డిప్రెషన్ల నుంచి బయటపడేందుకు ఇది  బాగా పనిచేస్తుంది.  దీన్లో ఉండే సూక్ష్మపోషకాలు వయసు ప్రభావం మెదడు మీద పడకుండా చేస్తాయి. పల్లెల్లో కనిపించే, సరస్వతి మొక్క ఆకులను విద్యార్దులకు చూపించి, వాటిని తిని చూపించి, ఇంట్లో పెంచుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: