ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ఇవి తీసుకుంటే చాలా మేలు!

Purushottham Vinay
ఉదయం పూట తేనెను తీసుకోవడం వల్ల మీ మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.తేనె కేవలం శక్తిని ఇవ్వడానికి మాత్రమే కాకుండా అనేక జీవక్రియలకు చాలా అవసరం. ఎందుకంటే చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే ఈ తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే బ్యాక్టీరియాని చంపేస్తుంది.ఒక కిలో తేనెలో నీటి శాతాన్ని బట్టి సుమారుగా 3150-3350 కేలరీలు ఖచ్చితంగా ఉంటాయి. మన శరీర ఎదుగుదలకు అవసరమైన విభిన్న పదార్థాలు 80కి పైగా తేనెలో వున్నాయి. ఎన్ జైములు చాలా ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో తేనె ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.ఓట్స్‌ను అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు.అలాగే రోజులో తీసుకోవల్సిన అత్యవసర ఆహారం బ్రేక్ ఫాస్ట్. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో ఎప్పుడూ సరైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.ఇక అందు ఫలితంగా రోజు మొత్తం ఎనర్జీను కొనసాగించడంలో బాగా దోహదపడుతుంది.అలాగే అదే సమయంలో మీ శరీర బరువును కూడా తగ్గించుకోవచ్చు. అందుకే బరువు తగ్గించగలిగే బ్రేక్‌ఫాస్ట్ ఎంచుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.


బ్రేక్ ఫాస్ట్ గా ఓట్స్ తీసుకోవడం చాలా మంచిది.ఉసిరికాయను ఉదయం పూట నిద్రలేచిన తర్వాత తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఉసిరికాయలో బోలెడు ఔషధగుణాలు అనేవి ఉన్నాయి. ఉసిరికాయ తింటే రోగ నిరోధక శక్తిని పెంపొందించడం తోపాటు అనేక రకాల అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతగానో అడ్డుకుంటుంది.ఇక ఉసిరి పొడిని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలను చాలా ఈజీగా తొలగిస్తుంది. అలాగే ఈ పొడిలో కొద్దిగా తేనె కూడా కలిపి తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక 10 గ్రాముల ఉసిరి గింజలను ఎండలో ఎండబెట్టి ఇంకా వాటిని మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇంకా అలాగే అందులో 20 గ్రాముల చెక్కెర పొడిని కలిపి ఉంచుకోవాలి. ఉదయం పూట ఖాళీ కడుపుతో 1 గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ పొడిని కలిపి 15 రోజుల పాటు రోజూ కూడా తీసుకోవాలి. ఇలా చేస్తే నిద్రలేమి సమస్య నుండి బయట పడవచ్చు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: